Wednesday, August 9, 2023

మణిపూర్ చరిత్ర part 3


(Face book లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్)
ప్రస్తుత మణిపూర్ హింసకి మతం రంగు పూయడానికి చేసిన ప్రయత్నం కొంత వరకు సఫలీకృతం అయ్యింది!
కానీ నిజాలు నిలకడగా బయటపడుతున్నాయి!
***************
ఎవరు ఏమి ఆశించి ఈ దారుణాలకి ఒడి గడుతున్నారు?
ఇక్కడ దారుణం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది?
అది దారుణం కానే కాదు! ప్రీ ఫాబ్రికేటెడ్!
నగ్నంగామహిళలని ఊరేగించింన వ్యక్తి మెతీ తెగకి చెందిన వాడు అన్నది నిజం! కానీ సదరు వ్యక్తి కూడా క్రిస్టియన్!
కుకీ మహిళలు క్రిస్టియన్ అలాగే వీడియో లో చూపబడ్డ మెతీ తెగ వ్యక్తి కూడా క్రిస్టియన్!
మెతీ ప్రజలలో కూడా మతం మారిన క్రిస్టియన్లు ఉన్నారు!psp
వీడియో వైరల్ అవగానే(చేయబడ్డది) హడావిడిగా సదరు నిందితుడి ఇల్లుని మహిళలు కూల్చివేశారు.
ఆ ఇల్లు అలాగే ఉంటే మీడియా కెమెరాలతో లోపలికి వెళ్లి చూపిస్తే అసలు బండారం బయట పడుతుంది.
అంచేత హడావిడిగా కూల్చివేశారు!psp
*************
దేశం అంతటా కిరోసిన్ చల్లబడ్డది!
*******************
చాలా ప్లాన్డ్ గా may 3 వ తారీఖున మొబైల్లో వీడియో తీసి పార్లమెంట్ సమావేశాలకు ముందు బయటికి వదిలారు.
ఓహ్! మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు కట్ చేశారు కదా? ఇదొక ఎలిబీ! మణిపూర్ నుండి వీడియో ఢిల్లీ కి చేరడానికి 40 రోజులు పట్టింది!
**************
ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతూన్న హింసకి మతానికి సంబంధం లేదు.పైకి కనపడేది వేరు కనపడకుండా జరుగుతున్నది వేరే!
******************
రెండువేల నోట్లు చెలామణీ నుండి ఉపసంహరించడం ప్రస్తుత మణిపూర్ హింసకి ప్రధాన కారణం!
******************
డ్రగ్ బిజినెస్ నడిచేది ప్రధానంగా డాలర్లు మరియు క్రిప్టో కరెన్సీ లో. కానీ స్థానిక కరెన్సీ అవసరం కూడా ఉంటుంది గంజాయి పండించే ముఠాలకి. ముఖ్యంగా మణిపూర్,నాగాలాండ్, మిజోరం బెల్ట్ లో నాగాలతో పాటు కుకీలు కూడా గంజాయి పండిస్తున్నారు కానీ వీళ్ళ దగ్గరకొనే దళారీలు వీళ్ళకి మన రూపాయల్లోనే చెల్లింపులు చేస్తారు. రవాణా కి అనువుగా ఉంటుంది అని పెద్ద నోట్లని అంటే ప్రస్తుతం 2వేలు,500 నోట్లనే స్టాక్ పెట్టుకున్నారు.ఇప్పుడు2వేల నోట్లు మార్చుకోవడం కష్టం అయ్యింది.psp
ఇప్పటికే 88% 2వేల నోట్లు తిరిగి వచ్చేశాయని RBI చెప్తున్నది. బహుశా 100% తిరిగి రాకపోవచ్చు.
********************
ప్రస్తుతం మెయితీ పెద్దలతో, అటు కుకీ పెద్దలతో శాంతి చర్చలు జరుపుతోంది కేంద్ర హోమ్ శాఖ.psp
*****************((*(
కానీ కుకీలు చట్టబద్ధం కాని పేచీలు పెడుతున్నారు.
కుకీల ప్రధాన డిమాండ్ ఏమిటంటే తాము గంజాయి పండించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని.psp
****************
మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లాడానికి కారణం?
1.మణిపూర్ లో ని థౌబల్(thoubal)లో అక్రమ డ్రగ్స్ ఫాక్టరీ ని కనుక్కుని దానిని నాశనం చేశారు.
2.500 KG బ్రౌన్ షుగర్ ని సీజ్ చేసింది మణిపూర్ ప్రభుత్వం.
3.మణిపూర్ లోని ఒక పోలీస్ chekpost ని పై అధికారులు తనిఖీ చేసినప్పుడు కిలోల కొద్దీ హెరాయిన్ దొరికింది. 
4.చెక్ పోస్ట్ లోని పోలీసులే హెరాయిన్ అక్రమ రవాణా వ్యాపారంలో భాగస్థులుగా ఉన్నట్లు విచారణలో బయట పడ్డది .
5. మొత్తం 6 గురు పోలీసుల్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వమ్.
6. DIG రాంక్ పోలీసు అధికారులు కుకీలు చేసే డ్రగ్స్ అక్రమ రవాణా కి సహకరిస్తున్నట్లుగా విచారణ లో బయటపడ్డది. అయితే ఈ విషయం బయటపెట్టలేదు అక్కడి ప్రభుత్వం. కేవలం బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచింది.
7.మణిపూర్ పొరుగు రాష్ట్రం అయిన అస్సాoలో అక్కడి అస్సామ్ రైఫిల్స్ విభాగం 400 కోట్ల విలువచేసే డ్రగ్స్ ని పట్టుకొని సీజ్ చేసింది. ఇవి కుకీల నుండి స్వాధీనం చేసుకున్నారు.
*********************
దాదాపు 800 కోట్ల విలువ చేసే మత్తు పదార్ధాలు పట్టుబడ్డ తరువాత కొద్దీ రోజులకి మణిపూర్ హై కోర్టు మెతీ ప్రజల డిమాండ్ అయిన ST కాటగిరీ ని పరిశీలంచమని తీర్పు రాగానే హింసకి దిగారు కుకీలు.
*****************
May3,4 తారీఖులలో ఇద్దరు మెతీ మహిళలు రేప్ కి గురయ్యారు మరో నలుగురిని సజీవ దహనం చేశారు కుకీలు. ఈ విషయం మరుగున పడిపోయింది.
*****************
చిన్-కుకీలు:
బర్మా లోని చిన్ రాష్ట్రానికి చెందిన కుకీలని చిన్-కుకీలు అని పిలుస్తారు. అలాగే మిజోరం లో ఉండే కుకీలని మిజోకుకీలు అని పిలుస్తారు.
వీళ్ళు ఉండేది మణిపూర్ లో కానీ మణిపూరీ లు అని పిలిస్తే మాత్రం విపరీతమయిన కోపంతో కొట్టడానికి వస్తారు. ఇలాంటి విద్వేషాపూరిత భావజాలాన్ని ఎవరు వీళ్ళ మెదళ్ళలో నింపారు?
******************
పొట్ట చేత పట్టుకొని మన దేశానికి శరణార్ధులుగా వచ్చిన వాళ్ళకి 1968 లో మెతీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు.
******************
ఉండడానికి ఇళ్ళు కట్టించి ఇచ్చింది మణిపూర్ ప్రభుత్వం.
ఇంటిపన్ను కట్టలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఇంటి పన్నుని కట్టింది. ఫోటో చూడండి!
******************
అసలు ఈ రోజున ఈశాన్య రాష్ట్రాల ఇలా ఉండడానికి కారణం సెహ్రూ!
1954 లో సెహ్రూ చేసిన నిర్వాకం!
బ్రిటీష్ ఇవాంజలిస్టు అంటే క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన వెర్రిర్ ఎల్విన్ (Verrier Elwin) నాగాలాండ్ కి గిరిజనుల మీద పరిశోధన చేయడానికి గాను మరియు సలహాదారుగా నియమించాడు. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక నియామకం!
అయితే ఒక మత ప్రబోధకుడిని నియమిస్తే బాగోదని 
ఫిలాంట్త్రోపిస్ట్ గా పిలిచాడు ఎల్విన్ ని.
అయితే వెర్రిర్ ఎల్విన్ నాగాలాండ్ లో నాగాలు ఉండే చోటుకి నాగా సాధువులు ప్రవేశించకుండా నిషేధం విధించమని సెహ్రూ కి సలహా ఇచ్చాడు.
సెహ్రూ ఎల్విన్ కొరినట్లుగా నాగా సాధువులతో పాటు వేరే ఎవ్వరికీ ప్రవేశం లేకుండా నిషేధం విధించాడు!
కానీ క్రైస్తవ మత ప్రచారకులు మాత్రం స్వేచ్ఛగా వెళ్ళవచ్చు వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు!

****************
ఒక విదేశీయుడిని అందునా మతప్రచారకుడి ని మన దేశ గిరిజనుల మీద పరిశోధనకి అనుమతి ఇవ్వడం పెద్ద తప్పు.
ఎల్విన్ నాగా సాధువులకి ప్రవేశం లేకుండా నిషేధం విధించమని చెప్పడం దానిని సెహ్రూ అమలుచేయడం మరో చారిత్రిక తప్పిదం!
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ పేరుతో సెహ్రూ కుటుంబాన్ని చూపడం మీద ఒక మిత్రుడు ఇంకా ఎవరూ లేరా ? అంటూ వ్యంగంగా కామెంట్ చేసాడు.
సదరు వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు?
ఇంకా ఉంది….
జైహింద్!

No comments: