Saturday, August 5, 2023

మణిపూర్ రాష్ట్ర చరిత్ర part 1

(Face book లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్ copy paste) మణిపూర్ రాష్ట్ర చరిత్ర - part-1
ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణ ల గురించి మనం ఏదన్నా విశ్లేషణ చేయాలి అంటే చరిత్ర లోతుల్లోకి వెళితే కానీ విషయం బోధపడదు!
ఇప్పటి ఆగ్రహానికి ఎన్ని దశాబ్దాల అణిచితివేత ఉందొ తెలుసుకోవాలి!PSP
చరిత్రని మరిచిపోయిన జాతికి మనుగడ ఉండదు!
మరీ లోతుల్లోకి వెళ్లి విసిగించే ప్రయత్నం చేయను!PSP
********************
మణిపూర్ కి 3500 సంవత్సరాల చరిత్ర ఉంది.PSP
మహాభారత కాలంలో అర్జునుడు మణిపూర్ రాజ్య రా కుమారిని పెళ్ళిచేసుకున్నాడు అని స్థానికులు ఇప్పటికీ విశ్వసిస్తారు.psp
శతాబ్దాలుగా వైష్ణవం ఇక్కడ పరిఢవిల్లడానికి కారణం  అర్జునిడితో వియ్యం ప్రధాన కారణం!
కొంతమంది చరిత్రకారులు వైష్ణవ గురువుల వల్లనే గౌడియ వైష్ణవం వ్యాప్తి చెందింది అనేది వాస్తవ దూరం.
స్వతహాగా వైష్ణవమ్ ని ఆచరిస్తుండడం వలన ఒకరో ఇద్దరో వైష్ణవ గురువులు మణిపూర్ ని సందర్శించి ఉండవచ్చు.psp.
********************
7 సిస్టర్స్ గా ఇప్పుడు పిలవబడుతున్న ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఒకప్పుడు ఒకే రాజ్యoగ ఉండేది. ఎక్కువ కాలం మణిపూర్ రాజుల ఏలుబడిలో ఉండేది. 1 వ శతాబ్దం నుండి 1956 వరకు మణిపూర్ ని పాలించిన రాజుల వివరాలు ఉన్నాయి.psp
మనకి స్వాతంత్ర్యం వచ్చే వరకు మణిపూర్ ఒక స్వతంత్ర రాజ్యాంగ ఉండేది.psp
మణిపూర్ ని పాలించిన చివరి రాజు రాజా బోధ చంద్ర సింగ్ (1908-1956).
2000 సంవత్సరాల మణిపూర్ చరిత్రని పరిశీలిస్తే హిందూ రాజులు పరిపాలించారు.
మైతే ప్రజలు హిందువులు మరియు శ్రీ కృష్ణుని భక్తులు.
భారత దేశంలో ఉండే వైష్ణవుల ఆచార, వ్యవహారాల కంటే గౌడియ వైష్ణవ సాంప్రదాయం కొంచెం భిన్నంగా ఉన్నా వారి ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు. రాధాకృష్ణుల ని కొలిచే సాంప్రదాయం మణిపూర్ నుండి ఇతర ప్రాంతాలకి వ్యాపించింది.అయితే ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.psp
మణిపూర్ రాజ్యంలో మొదటినుండి ఉన్నది మెతీ హిందూ ప్రజలు అయితే వీరితో పాటు పర్వత ప్రాంతాలలో కొన్ని జాతులు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నా వారు ప్రకృతి ఆరాధకులు గా ఉండేవారు. ఇప్పుడు నాగా, కుకీ ,మిజో లుగా పిలవబడుతున్న  వారు కూడా ఒకప్పుడు ప్రకృతిని దేవతగా ఆరాధించే వారు అయితే ప్రధానంగా వేట, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవారు. ఎవరితో ఎవ్వరికీ శత్రుత్వం ఉండేది కాదు.
********************
పునాది రాయి!
1870 లలో బ్రిటీష్ వారి దృష్టి మణిపూర్ మీద పడ్డది.
ఉత్తర భారతదేశంలో ఎండాకాలం లో వేడినుండి తప్పించుకోవడానికి మణిపూర్ అనువైన ప్రదేశంగా కనిపించింది. సంవత్సరం పొడవునా యూరోపుని తలిపించే వాతావరణం మణిపూర్ లో ఉండేది. కొన్ని విడిది కేంద్రాలు నిర్మించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులు కొంతమంది ఊటీ, కోడైకెనాల్ లు వెళితే మరికొంతమంది నైనిటాల్, మణిపూర్ లకి వెళ్లేవారు.psp
ముఖ్యంగా టీ తోటలు వాటి క్వాలిటీ బాగా నచ్చాయి వాళ్ళకి,పైగా ప్రకృతి సంపద ఎటూ ఉండనే ఉంది.
అప్పట్లో రోడ్ల సదుపాయం తక్కువ కాబట్టి ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది.
1930 లకి వచ్చే సరికి భూమిలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కనుక్కోగల టెక్నాలజీ మొదటిదశలోనే ఉన్నా మొత్తానికి ఈశాన్య దేశంలో క్రూడ్ ఆయిల్ ఉన్నదని కనుక్కున్నారు.psp
దక్షిణాసియాలో మనకంటూ సుసంపన్నమయిన క్రైస్తవ దేశం ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అది ఈశాన్య భారతదేశం. ఒక్క మణిపూర్ మాత్రమే కాదు నాగాలాండ్, మిజోరం.త్రిపుర, అస్సామ్,సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయ లు కలిపి ఒకే క్రైస్తవ దేశంగా ఉంటే అప్పుడు తమకి అనుకూలంగా ఉంటుంది అని ప్లాన్  చేశారు. psp.
అప్పటికే ఈశాన్య రాష్ట్రాల లో చర్చిలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విద్య పేరుతో స్కూళ్లని కట్టడం లాంటివి మొదలుపెట్టాయి.
చర్చి టార్గెట్ మొదట గిరిజనులని మతం మార్చడం.
చివరి నుండి నరుక్కు రావాలి అని ప్లాన్.psp.
అంటే బర్మా సరిహద్దుల నుండి భారత్ లోపలికి ఒక క్రమ పద్ధతిలో మత మార్పిడులు చేసుకుంటూ వెళ్ళాలి.
మిజోరం లో వేగంగా మత మార్పిడులు చేశారు.
మరోవైపు మిగతా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మత మార్పిడులు జరుగుతున్న తరుణంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యి జపాన్ సైన్యం బర్మా లోకి చొచ్చుకు వచ్చి మణిపూర్ ని కూడా స్వాధీనం చేసుకుంది1944 లో!
దాంతో చర్చి కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది
జపాన్ సైన్యంతో కలిసి సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ fouj బర్మా లో తన సత్తా చాటింది 1944 లో.  ఇక బ్రిటీష్ వాళ్ళు భారత్ వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని భావించారు. 
కానీ ఇక్కడే ఒక విషయం బయటపడ్డది. అది బర్మా వైపు నుండి ఈశాన్య రాష్ట్రాల లోకి చాల తేలికగా చొరబడవచ్చు అని.
*************************
బ్రిటీష్ వాళ్ళ ముందస్తు వ్యూహం!
మణిపూర్ లో మెయితీ ప్రజలు హిందూ వైష్ణవులు కాబట్టి వాళ్ళని మతం మార్చడం కష్టం అని భావించిన బ్రిటీష్ అధికారులు విభజించి పాలించు అనే తమ సిద్ధాంతాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు.
Outer Line Permit - Inner Line Permit .
1.మొదట మణిపూర్ లోకి బయట నుండి ఎవరన్నా రావాలి అంటే ఔటర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి.
2.పర్వత ప్రాంతాలలో ఉండే నాగా,కుకీ లని కలవాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి.
3.కానీ చర్చికి సంబంధం ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికి అయినా వెళ్ళవచ్చు.
4.ముందు పర్వత ప్రాంతంలో ఉన్న నాగాలని,కుకీలని క్రైస్తవంలోకి మార్చారు. ఆ ప్రాంతాలలోకి మైతీ ప్రజలకి కూడా ప్రవేశం ఉండేది కాదు కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలిసే అవకావశం లేదు.
5.పర్వత ప్రాంతంలో ఉన్న నాగాలు, కుకీలు స్వేచ్ఛ గా మెతీ లు ఉండే ప్రాతంలో  తిరగవచ్చు.
6. పర్వత ప్రాంత నాగాలు, కుకీలు స్వేచ్ఛగా గంజాయి పండించి అమ్ముకోవడాన్ని అనుమతించారు బ్రిటీష్ అధికారులు. ఇదే కీలక పాత్ర వహించింది మతం మారడానికి.
7.గంజాయి మత్తులో ఉన్నప్పుడు మతం మార్చడం తేలిక!
*********************
1947 లో మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినా బ్రిటీష్ వాళ్ళు ఈశాన్య భారతం మీద ఆశ వదులుకోలేదు.
1.నెహ్రూ ప్రధాని కాగానే అప్పటి మణిపూర్ రాజు బోదచంద్ర సింగ్ నెహ్రు ని కలిసి రెండు డిమాండ్లని కోరాడు. ఔటర్లైన్, ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని తీసివేయమని కోరాడు.
2.మెతీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలని రక్షించడానికి మెతీ ప్రజలని ST కింద పరిగణిస్తూ రాజ్యాంగంలో పొందు పరచాలి!
3.అప్పటికే నిపుణులు రాజ్యాంగ విధి విధానాలను పొందుపరిచే పనిలో ఉన్నారు కాబట్టి రాజా బోదచంద్ర సింగ్ సరయిన సమయంలోనే నెహ్రూ ని కలిసాడు.
4.రాజా బోధ చంద్ర సింగ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించి అమలు చేస్తానని హామీ ఇచ్చాడు నెహ్రు!
5.కానీ రాజా బోదచంద్ర సింగ్ అడిగిన దానికి భిన్నంగా నెహ్రు నాగా, కుకీలను ST కేటగిరీ కింద పొందు పరుస్తూ ఏకంగా రాజ్యాంగం 6 షెడ్యూ ల్ లో చేర్చాడు.
6.నాగా,కుకీలు ఉండే 90% ప్రాంతాలలో వేరే వాళ్ళు భూములు కొనడానికి వీలులేదు.కానీ నాగాలు, కుకీలు మాత్రం ఎక్కడయినా భూములు కొనవచ్చు.
7. విద్య, ఆరోగ్యం విషయాలలో ప్రత్యేక సదుపాయాలతో పాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చాడు నెహ్రూ!
8.అసలు షెడ్యుల్ ట్రైబ్ అనే దానికి వారు ఏ మతానికి సంబంధం ఉన్నదో అన్నది వివరంగా లేదు.
9. 80% పర్వత ప్రాంతం నాగా, కుకీల ఆధీనంలో ఉంది. మిగతా లోయ ప్రాంతం20% మెతీ లతో పాటు ఇతరులు కలిసి జీవిస్తున్నారు.
10.గిరిజనులు హిందువులు కాదు అనే నినాదం ఇటీవల బాగా వినపడడానికి కారణం క్రైస్తవం ని విస్తరించే కుట్రలో భాగం!
11. బర్మా తో పాటు ఈశాన్య భారతంలో ప్రొటె స్టెంట్ క్రైస్తవం బలంగా ఉంది. సిరియన్ కాథలిక్ బలహీనంగా ఉంది మణిపూర్ లో.
12.నాగా, కుకీలని ST కేటగిరీ లో చేర్చడం వెనుక నెహ్రూ మీద అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ ఒత్తిడి ఉంది అన్నది నిజం.
13. అయితే అప్పటికే అంటే 1960 దశకంలోనే క్రైస్తవ జనాభా వేగంగా పెంచడానికి గాను బర్మా నుండి కుకీలని మణిపూర్ లోకి తీసుకురావడానికి కుట్ర జరిగింది అది విజయవంతంగా అమలు జరిగింది.
14.బర్మా నుండి వచ్చిన(తీసుకురాబడ్డ) శరణార్ధుల కి మణిపూర్ లో పునరావాసం కల్పించమని కోరుతూ 1967 లో కేంద్రం నుండి మణిపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖలు బయటికి వచ్చాయి.
15. 1968 అంటే సంవత్సరం తరువాత రెండో లేఖ వచ్చింది మణిపూర్ ప్రభుత్వానికి బర్మా కాందిశీకులకి పునరావాసం కల్పించాలని కొరుతూ.
16. బర్మా నుండి తేబడ్డ వారు కుకీలు. సహజంగానే వీళ్ళకి ST హోదా ఉన్నది కాబట్టి నాగాలు ఉండే పర్వత ప్రాంతాలలో ఉండడానికి హక్కు ఉన్నది కాబట్టి పర్వత ప్రాంతాల్లో ,మరియ మైదాన ప్రాంతాల్లో ఉండే మెయితీ ప్రజలతో పాటు ఉండే హక్కు కూడా ఉంది.
17.చాలా వ్యూహాత్మకంగా బర్మా నుండి వచ్చిన కుకీలు అటు పర్వత ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాలలో కూడా స్థిరపడ్డారు.
18.అప్పటికే క్రైస్తవాన్ని ఆచరిస్తున్న నాగాలకి ప్రకృతిని ఆరాధించే కుకీలకి మత పరమయిన విభేదాల వల్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి.
19.1985 నాటికి ఘర్షణలు కాస్తా చిన్నపాటి యుద్ధాలు జరిగాయి. డబ్బు, ఆయుధాలు పుష్కలంగా అందుబాటులో ఉండడం వలన కుకీల మీద నాగాలదే పైచేయిగా ఉండేది. చర్చి ద్వారా ఇవి అందేవి నాగాలకి.
20.80 వ దశకం చివరికి వచ్చేసరికి కుకీలలో ఒక వర్గం ని చీల్చి వాళ్ళకి డబ్బు, ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహించింది చర్చి. ఈసారి కుకీలది పై చేయి అయింది నాగా ల మీద.
21.కుకీలకి అర్ధమయింది ఏమిటంటే క్రైస్తవం స్వీకరిస్తే డబ్బు, ఆయుధాలు దొరుకుతాయి అని.
22.కుకీలు అందరూ క్రైస్తవం స్వీకరించారు. తాత్కాలికంగా నాగల, కుకీల మధ్య వైరం తగ్గినా జాతుల మధ్య ఉండే అసహనం అలాగే ఉండిపోయింది.
23.క్రైస్తవం స్వీకరించినా పాత సాంప్రదాయాలని యధావిధిగా కొనసాగించే వెసులుబాటు ఇస్తుంది చర్చి.
24.ఇది జాతుల మధ్య మొదట ఘర్షణగా మొదలయ్యి చివరికి వేల మరణాలకి కారణం అవుతుంది. అక్కడ జరిగేది మత ఘర్షణ ఎంతమాత్రం కాదు కేవలం జాతుల మధ్య ఉండే వైరుధ్యాల వల్లనే. ఎందుకంటే వివిధ జాతులు వెలల్లో ఉన్నాయి కానీ మతం ఒక్కటే.
25. నాగాలాండ్, మిజోరం, మణిపూర్ లు బర్మా తో సరిహద్దులు కలిగి ఉండి బర్మాతో పాటు సౌత్ ఈస్ట్ దేశాలతో అనుసంధానం గా ఉండే రోడ్ మార్గాలతో కలుపబడి ఉంది. ఈ విషయం ప్రస్తావన చేయడానికి కారణం ఉంది.psp
26. 1975-79 ల మధ్య కాంబోడియా (కంపూచియా) నియంత పోల్ పాట్ జరిపిన మారణ హోమంలో 20 లక్షల మంది ప్రజలు మరణించారు. ఇది అప్పటి కాంబోడియా జనాభాలో నాలుగో వంతు.
27. 1975 లో పోల్ పాట్ బీజింగ్ వెళ్లి మావో ని కలిసి తిరిగి కాంబోడియా వచ్చాక మారణ హోమానికి పాల్పడ్డాడు. తన స్వంత ప్రజలని చంపడానికి ఖ్మెర్ రోగ్ ,పోల్ పాట్ లు పెట్టిన పేరు సాంస్కృతికవిప్లవం.
28.అల్ట్రా - మావోయిజం  గా పేరుపడ్డ ఆనాటి మారణ హోమంలో భాగంగా జాతుల, మతాల, వర్గాల మధ్య చిచ్చుపెట్టి నగరాలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రజలని తీసుకెళ్లి మారుమూల ప్రాంతాలలో సామూహికంగ హత్య చేశాడు పోల్పాట్.
29. కాంబోడియా దేశంలో ఒకే రకమయిన ప్రజలు,ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలి అనేది ఖ్మెర్ రోగ్, పోల్ పాట్ ల లక్ష్యం. మావో చేసింది అదేగా!
30.కాంబోడియా లో జరిగిన మారణ హోమానికి మావో చేసిన సహాయం అప్పట్లో 1.2 బిలియన్ డాలర్లు! అది ధనం, మిలటరీ రూపంలో చేసింది చైనా.
31. మన పొరుగు దేశం బర్మా(బ్రహ్మ దేశం) లో ఎప్పుడూ అశాంతి ఎందుకు ఉంటూ వస్తున్నది? కమ్యూనిజం ని ప్రమోట్ చేస్తూ వస్తున్నది చైనా.
32.రోహింగ్యా  లని బౌద్ధులు దేశం నుండి వెళ్లగొట్టడానికి అక్కడి ప్రభుత్వం సహకరించింది. రేపొద్దున బౌద్ధులని కూడా అలాగే చంపదని గ్యారంటీ ఉందా?చైనాకి కావలిసింది ఇదే!
33. 400 ల ఏళ్ల క్రితం అమెరికాలో క్రైస్తవం ఎక్కడ ఉంది? అమెరికాలో స్థానిక ప్రజలని మొత్తం నాశనం చేశాకే కదా అక్కడ యూరోపియన్లు స్థిరపడ్డది.
34. అటు కమ్యూనిస్ట్ లకి ఇటు చర్చికి అడవులలో ఉండే గిరిజన జాతులు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ముందు మతం మార్చి (కమ్మీలకి నేరుగా చంపడం ద్వారా ఏక మొత్తంగా నిర్మూలించడానికే ఇష్ట పడతారు) తరువాత రోగాలు వ్యాపింప చేసి ఒక క్రమ పద్ధతిలో నిర్మూలిస్తారు .
మిగతాది పార్ట్ 2 లో.
జైహింద్!

No comments: