చక్కని చుక్కవే..మెరిసే చుక్కవే
అంబరమే నీ అంబరమౌను కదా
నీలాలే నీ నీలాలు కావా
అందాల చందమామ అందాల నీకు
అట్లతద్దినాడు అట్లా అట్లా
తెలుపు.. అతనికి నీ మనసు తెలుపు
రాయి కూడా కరిగేలా నీ ఊసులు రాయి
చేయి చేయి కలిపి ప్రేమ బాసలు చేయి
నీ అడుగు తో అడుగేస్తాడేమో అడుగు
అలిగితే అలుగు..అవబోకు అలుగు
కలిసినడిచే మీ పాదాలు
సొగసైన తెలుగు పద్యపు పాదాలు
ఎన్నడూ అవకండి వేరుగా
పెనవేసుకుపొండి ఒక్కటే వేరుగా
No comments:
Post a Comment