Emotional dependency - sharing emotions.
Sharing emotions is different from emotional dependency.
Emotional dependency లో ఒకరి మీద ఆధార పడటం వలన పోను పోను ఆ బంధం (అది ఎలాంటి బంధమయినా కావచ్చు) అవతలి వాళ్లకి విసుగ్గా, ఊపిరి ఆడనట్టుగా అనిపించి బంధం బలహీనపడే అవకాశం ఉంది. అలా ఆధార పడిన వాళ్ళు ఒకోసారి childish గా, impulsive గా, అప్పుడప్పుడూ possessive గా కూడా తయారవచ్చు. తన భావాలకు అవతలి వాళ్ళు తప్పనిసరిగా (చాలావరకు తమకు అనుకూలంగా మాత్రమే) స్పందించాలన్న expectation ఉంటుంది. లేకపోతే వాళ్ళమీద కోపం, తమ మీద తమకు జాలి మొదలవుతాయి. అవతలి వాళ్ళ పరిస్థితి వీళ్లకు అవసరం ఉండదు, అర్ధం చేస్కోరు ఒక్కోసారి. దానివలన వీళ్ళ నుంచి తప్పించుకోటానికి చూస్తూ వుంటారు రెండోవాళ్ళు నెమ్మదిగా..వీళ్ళ మీద చులకన భావం కూడా ఏర్పడవచ్చు.
Wehereas ఎమోషన్స్ ని పంచుకోటం అనేది పూర్తిగా డిఫరెంట్ థింగ్. ఇందులో compulsions , expectations ఉండవు చాలా వరకు. Mutual respect ఉంటుంది. తమ ఎమోషన్స్ ని accept చేయాలి.. బలపరచాలి అని ఆశించటం ఉండదు. దానివలన అవతలి వాళ్లకి suffocating గా అనిపించదు. విషయాలు పంచుకోటానికి ఇలాంటి వాళ్ళతో hesitation ఉండదు. ఫ్రీ గా అనిపిస్తుంది. సాధారణంగా వీళ్ళు judge చేయరు.
ఏమయినా..మొత్తానికి రెండు రకాల్లోనూ ఆ ఇద్దరి లేదా ఆ కొంతమంది involvement తప్పనిసరిగా ఉంటుంది.. ..ఎమోషనల్గా ఆధారపడటానికి అయినా, ఎమోషన్స్ పంచుకోటానికి అయినా. ఆఖరికి ఎమోషన్స్ ఎవరికీ పంచుకోకపోయినా ఇంకొకళ్ల ప్రభావం ఉంటుంది. అసలు ఎమోషన్ అనేది వేరొకరి ప్రమేయం, ప్రభావం లేకుండా వచ్చేది కాదు. ఆఖరికి అన్నీ వదిలేసి తపస్సు చేసుకునే ఋషులకి కూడా భగవంతుడితో ఎమోషన్ ఉంటుంది కదా..అలాంటిది మనం మామూలు మనుషులం..సంఘ జీవులం...షేరింగ్ ఎమోషన్స్ is not a bad thing after all.
No comments:
Post a Comment