Monday, October 6, 2008

నీ స్పర్శ...


మనిద్దరం ఒకటి కాబోతున్నామనే ఆనందాతిశయంతో నా చేయి అందుకున్న నీ చేతి మొదటి స్పర్శ..
ఇంక ఇద్దరమూ ఒక్కటిగా వుందామంటూ జీలకర్రా బెల్లం తో ఒట్టు పెట్టిన స్పర్శ...
కన్యాదానం అందుకుని..పాణిగ్రహణం చేసిన స్పర్శ..
మంగళసూత్రం తో మెడ ఫై నీ ముని వేళ్ళ స్పర్శ..
తలంబ్రాల వేడుకలో ఆడుకున్న చేతుల స్పర్శ..
అగ్నిసాక్షిగా ప్రదక్షిణలో నీ చిటికెన వేలి స్పర్శ..
మట్టెలు
తొడుగుతూ నా పాదాలు తాకిన గిలిగింతల నీ స్పర్శ..
బిందెలో వుంగరం తీస్తూ అల్లరి చేసిన స్పర్శ..
అరుంధతి ని చూపిన స్పర్శ..

అప్పగింతలలో నీకు నేనున్నాననే భరోసా స్పర్శ..
నా సంతోషాలని పంచుకున్న స్పర్శ..
కృషి లో వెన్నుతట్టిన స్పర్శ..
దుఖం లో ఓదార్చిన, ధైర్యం చెప్పిన నిండు స్పర్శ..
నా ఆత్మను తాకిన నీ అనురాగపు స్పర్శ..
పద్ధెనిమిది వసంతాలుగా సాగుతున్న మన ప్రేమ ప్రయాణం లో
నా ప్రాణం గా మారిన నీ స్పర్శ..
అది నా శ్వాస ...






9 comments:

Raju said...

లక్ష్మీ గారు,
చాలా బాగా వ్రాసారు.


అభినందనలతో...
సీతారామరాజు,
http://seetaramaraju.blogspot.com

plz reply

Anonymous said...

అమ్మో అమ్మో నా కన్నా బాగా రాసేస్తున్నారు. మీ కన్నా నేను బాగా రాసేయ్యాలి. హిహిహి

Raju said...

thanks for ur reply...

Anonymous said...

నీకు కోపం వచ్చినప్పుడు అప్పడాల కర్రతో ఇచ్చిన స్పర్శ...
అది కూడా బాగానే గుర్తుంటుంది కదా..!! :)

చాలా బావుందండి మీ కవిత...

Lakshmi Ramarao Rajamanuri Vedurumudi said...

bhale idea ichaarandee anonymous gaaruu..bahusha..meeku swaanubhavamemo..hahaha..

Sadhana Ramchander said...

This is so touching and romantic, Ramalakshmi! Very beautiful and well written. Thanks to you, I am reading some Telugu...I hope I improve my Telugu :)!

prince said...

lakshmi chaala andhanga varninchaavu

venu said...

Laks! this is really touchy!

sudhakishan.d said...

lakshmi 'ni sparsa' kavitha nijamga chala bagumdi...........na gumde nu ala ala sprsimchimdi.........chala baga rasavu..........