'మహీ..ఏయ్ మహేష్' ఇలియానా అరిచిన అరుపుకీ, గట్టిగా అంటించిన చురకకీ మహేష్ బాబు అదిరిపడి నిద్రలేచాడు.
'పెళ్ళికి ముందు ఎలా వుండేదీ..ఇప్పుడు రాక్షసిలా తయారయింది' పైకి అనే ధైర్యం లేక, మనసులోనే గొణుక్కున్నాడు, మహేష్ బాబు.
'నువ్వు అనుకునేది ఏంటో నాకు తెలుసులే కానీ..పెళ్ళికి ముందు పోకిరి వేషాలు వేసినట్టు ఇప్పుడేస్తే కుదరదు..ఈరోజు మన నాని గాడి కోసం స్కూల్ చూడటానికి వెళ్తున్నాం ..గుర్తుందా అసలు నీకు?' వురిమింది ఇలియానా.
ఎందుకు లేదు తల్లీ..నాలుగు రోజుల నుండీ మనకు అదే పని కదా..ఒక్క స్కూలూ నచ్చదు నీకు..మళ్ళీ మహేష్బాబు స్వగతం..
'అది కాదే ఇలీ..ఈ రోజు ఏదో ఒక స్కూల్ సెటిల్ చేసేద్దాం..వాడింకా ఒకటో క్లాస్సే కదే..ఏ స్కూల్ అయితే ఏంటీ..' భయపడుతూనే అన్నాడు.
'ఏంటీ..వాడిని ఏదో ఒక స్కూల్ లో జాయిన్ చెయ్యాలా..ఏదో చెత్త స్కూల్ లో చదివిస్తే వాడు రేపు ఐ ఐ టి అవ్వాలంటే
ఎలా అవుతాడు..వాడు ఐ ఐ టి చదవాలనే నా కోరిక ఎలా తీరుతుంది..?' మళ్ళీ వురుము..
'మన కలలూ, కోరికలూ వాడి మీద ఎందుకే రుద్దటం..ఐ ఐ టి ఒక్కటే వుందా చదవటానికి..వాడికి ఏది ఇష్టమో అదేచదువుతాడు..' ఈ మాటలన్నీ పైకి అంటే ఏమవుతుందో తెలుసు కాబట్టి , ఆ ధైర్యం చేయలేదు మహేష్ బాబు.
"విద్యా నిలయం" పేరు చక్కగా వుంది..హడావిడి లేకుండా..స్కూల్ పేరు చూడగానే అనుకున్నాడు. ఇలియానా పెదవివిరిచింది..
స్కూల్ లోపలికి వెళ్ళగానే పిల్లలందరూ యూనిఫాం లో ముచ్చటగా కనిపించారు..కానీ ఏదో తేడా కనిపించిందిఇద్దరికీ..పరీక్షగా చూసారు పిల్లలని..
మామూలుగా పిల్లల మెడలు బిగించేసి, బంధించేసినట్టుగా వుండే టై లేదు..ఇంకా ..చిట్టి చిట్టి పాదాలకి గాలితగలకుండా మూసేసే షూస్ లేవు..మంచి చెప్పులు వేసుకుని హాయిగా కనిపించారు పిల్లలందరూ..
మహేష్ బాబు కి పిల్లల ని అలా చూడగానే ఎంతో ఆనందం గా అనిపించింది..
'ఇదేమీ స్కూల్ బాబూ..' ఇలియానా పెదవి విరుపు..
ఇద్దరూ ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్ళారు. తెల్లటి చీరలో, చిరునవ్వు తో పిల్లలని వుద్ధరించటానికి వచ్చిన దేవతలా , ప్రశాంతం గా కనిపించింది..ప్రిన్సిపాల్ ..మహేష్ బాబుకి .
ఇలియానా వెంటనే టై, షూస్ గురించి అడిగేసింది..ఆగలేక..
ప్రిన్సిపాల్ చిరునవ్వుతో చెప్పింది..'మన దేశపు వాతావరణానికి అవన్నీ నప్పవు..పిల్లలని ఎందుకు ఇబ్బంది పెట్టటంవాటితో..అందుకే మేము అవన్నీ వద్దనుకున్నాము.'
సిలబస్, పరీక్షలూ, మార్కులూ, టీచర్లూ వగైరా ల గురించి అడిగాడు మహేష్ బాబు..
ఇలియానా కి అప్పటికే ఆ స్కూల్ మీద ఆసక్తి పోవటం తో ఏమీ మాట్లాడ లేదు..
ప్రిన్సిపాల్ , మహేష్ బాబు అడిగిన వాటికి సమాధానం చెప్పటం మొదలు పెట్టింది..
ప్రస్తుతం మా స్కూల్ లో ఐదోక్లాసు వరకే వుంది కాబట్టి, సిలబస్ మేము మా స్వంతంగా, ఆ వయసు పిల్లలకి ఆసక్తికలిగేలా, అర్ధమయ్యే సులభమైన పద్ధతిలో తయారు చేసుకున్నాము.
ఇంటర్ వరకూ చదువుకుని , ఆర్ధిక స్తోమత లేక చదువు ఆపేసిన వాళ్ళని టీచర్లు గా పెట్టుకుంటాము. వాళ్ళకి మేముప్రత్యేకంగా, మా పద్ధతులూ, విధానాలకు తగినట్లు బోధించేందుకు శిక్షణ ఇస్తాము.
ఇంక పరీక్షలూ, మార్కులూ..అసలు మేము పిల్లలకి పరీక్షలే పెట్టముఇంక మార్కుల ప్రసక్తే లేదు ..
ఒక లెసన్ చెప్పిన తర్వాత, అందులో వున్నవిషయం , పిల్లలు వాళ్ళకి వాళ్ళే అర్ధం అయ్యేలా, వాళ్ల చేతే , వాళ్ళకిఅర్ధం ఐనది, అలానే చెప్పమంటాము..దాదాపు అందరూ చక్కగా చెప్తారు,,వాళ్ల మాటలలో. చెప్పలేని వాళ్ళకి, చెప్పగలిగిన పిల్లల చేతే మళ్ళీ చెప్పిస్తాము. దానివలన పిల్లలందరికీ కూడా విషయం బాగా గుర్తుండిపోతుంది..ఈపధ్ధతి వలన పిల్లల్లో సొంతగా ఆలోచించే శక్తి, విశ్లేషించి చూడటం అలవాతవుతాయి అని మా నమ్మకం. హోం వర్క్కూడా రోజుకి రెండు సబ్జక్ట్స్ నుండీ మాత్రమె ఇస్తాము. ఆ రోజు చెప్పిన పాఠం , వాళ్ళకి అర్ధం ఐనమాటల్లో రాయమనిప్రోత్సహిస్తాము.
వారం లో నాలుగు రోజులు ఆటల పీరియడ్ తప్పనిసరి..ఎవరికీ ఇష్టం ఐన ఆట వాళ్లు నేర్చుకోవచ్చు. వారం లో ఒకరోజు తోట పని పీరియడ్ వుంటుంది. పిల్లల చేత విత్తనాలు నాటించటం, మొక్కలకి నీళ్లు పోయటం నేర్పిస్తాము. పిల్లలకిప్రక్రుతి ని పరిచయం చేయటం కోసం.
ఇంక అన్నిటికంటే ముఖ్యం ఐన రోజు, ప్రతి శనివారం రెగ్యులర్ క్లాసెస్జరగవు. ఆ రోజు ని పిల్లలకి మానవ సంబంధాలు, మానవతా విలువలు ..ఇలాంటి విషయాలు చెప్పటానికి..అదీ వాళ్ళకి అర్ధమయ్యేలా , పిల్లల చేతే చిన్న చిన్ననాటకాలు వేయించటం ద్వారా , వాళ్ళకి విసుగు లేకుండా, ఆసక్తి కలిగేలా చెప్తాము..
ప్రతి శనివారం , వృద్ధ ఆశ్రమం నుండీ ఓపికా, ఆసక్తి ఉన్న పెద్దవాళ్ళు వచ్చి పిల్లల చేత ఇలా నాటకాలు వేయించటం, కధలు చెప్పటం చేస్తారు. న్యూక్లియర్ ఫామిలీస్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇలా చేయటం వలన పిల్లల్లో పంచుకోటం, శ్రద్ధ, గౌరవించటం, ఒంటరి భావన లేకుండా వుండటం..ఇవన్నీ నేర్చుకుంటారని మా నమ్మకం..
మహేష్ బాబు కి అన్నిటి కంటే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది..
నానిగాడిని ఎలా ఐనా ఈ స్కూల్ లోనే చేర్పించాలని ఉత్చ్చాహ పడిపోయాడు..
ఇలియానా ప్రమాదాన్ని పసిగట్టింది..మహేష్ బాబుని మోచేత్తో పొడిచింది..చాల్లే, నీ ఆవేశం అనుకుంటూ..
మహేష్ బాబు బిక్కు బిక్కు మంటూ చూశాడు ఇలియానా వంక..అర్ధం ఐపోయింది ..ఇలీ కి అస్సలు నచ్చ లేదుస్కూల్..
చేసేది లేక, ప్రిన్సిపాల్ వైపు చూసి ఓ వెర్రి నవ్వు నవ్వి, మళ్ళీ వస్తామని చెప్పాడు.
ప్రిన్సిపాల్ కి విషయం అర్ధం అయింది..తమ దగ్గరికి వచ్చే పేరెంట్స్ తొంభయ్ తొమ్మిది శాతం ఇలాంటివాళ్ళే..నవ్వుకుంది..తమ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళే చేరుతారు..నెమ్మది మీద ఐనా తమ స్కూల్ గురించితెలుస్తుంది..అందరికీ..
మహేష్ బాబు, ఇలీ బయటకి వచ్చారు..
ఈ స్కూల్ లో చదివితే మనవాడు ఏ తోటమాలో, నాటకాలు ఆదేవాడో అవ్వటం ఖాయం..మూతి తిప్పింది ఇలియానా.
"దేముడా.." తల పట్టుకున్నాడు మహేష్ బాబు..
"ఓయ్ , మహీ, లే ఇంక..స్కూల్ కి వెళ్ళాలనుకున్నాం కదా..నానిగాడి ని మంచి స్కూల్ లో వెయ్యాలి మహీ ఈ రోజుఐనా..మంచి స్కూల్ దొరికితే బాగుండు..నీకసలు పట్టదా ఏమీ..లే నువ్వసలు..." మహేష్ బాబుని ఒక్కటిచుకుందిఇలియానా..
వులిక్కిపడి లేచాడు మహేష్ బాబు..
"ఇదంతా కలేనా!!!!!!!!!!!!!" అని తెగ ఆశ్చర్య పోయాడు..
13 comments:
funny :)
The cinema does not end with the "Subham" card
వావ్ నిజంగా ఇలాంటి స్కూళ్ళు వస్తాయా?? అసలు ఎవరైనా ప్రారంభిస్తే బాగుణ్ణు.... మంచి విషయం మీద రాసారు టపా!!!
మహేష్ బాబు, ఇలియానాలనే ఎందుకు ఎంచుకున్నారు????
its my dream school..ilaanti school vunte baaguntundi ani anukuntuu vuntaanu..naa kala nijamavutundo ledo teleedu kadaa..anduke subham card veyyaledu.
vuttine..saradaagaa..funny gaa vuntundani..by chance..nuvvu veella veeraabhimaanivaa emiti naayanaa pasee!! inaa parledule..maheshbaabu ni manchi gaane cheppaanugaa!!!hammayya..
గుడ్డుకి అంతా ఫ్యాన్స్ ఉంటారు కానీ, గుడ్డు ఎవరికి ఫ్యాన్, ఏ.సిగా ఉండడు... ;-) ఇఇఇఇఇఇఇ కథ నచ్చితే సినిమా చూస్తా అంతే కానీ నేను ఎవరికి ఫ్యాన్ కాదండి.... మీరు ఏ.సిలేమో అందుకే వాళ్ళను ఈ స్టోరీలో పెట్టారేమో అనుకుంటున్నా
చాలా బాగుంది.
మీ ఊహల్లోని పాఠశాల ఉన్నతంగా ఉంది.
మీరు చెప్పినట్టుగా లేకున్న కనీసం కొన్ని అంశాలనైనా స్పృశించే స్కూల్స్ ఉన్నాయి.
వాటి సంఖ్య గణనీయంగా పెరిగి మంచి పౌరులని తయారుచేసే పాఠశాలలు రావాలని..మీ కల నెరవేరాలని కోరుకుంటున్నాను.
మీ ఊహల్లోని పాఠశాల చాలాబాగుంది. ఆ పాఠశాలని మీరే ప్రారంభించండి. నా వంతు సహాయం నేను చేస్తాను.
Beautiful dream, and dutiful life.
Nice presentation. Btw Can Ileana speak Telugu like ఓయ్! మహీ, ఇవాళ మన నాని గాడిని...
:-)
Hi Atha....ippude chadivanu nee blog. Nice imagination! chaala baundhi....blog...chaduvutuntaanu nee blog ni...
excellent ..
అటువంటి స్కూలు స్థాపించే స్థోమత, శక్తి, సామర్ద్యాలు మీకు దేవుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
nEnu kachitamga ilanti school vaste na pillalli indulone chadivistanu
లక్ష్మి గారు, మీ బ్లాగ్ ఇప్పుడే discover చేసాను. ఆసక్తికరంగా ఉంది.
హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న 'విద్యారణ్య' స్కూల్ గురించి నా స్నేహితులు (వాళ్ళ పిల్లలు చదివిన స్కూల్) చెప్పగా విన్నాను. అది ఇలాంటి స్కూలే అనిపిస్తుంది. ఆటలకి ప్రోత్సాహం బాగా ఉంటుందిట. యూనిఫాం నిబంధన లేదట. పిల్లల తల్లిదండ్రుల ఆస్తి అమ్ముకోవలసి వస్తుందా అని భయపెట్టేంత ఫీజులు లేవట. కాని పేరున్న స్కూళ్ళల్లో ఒకటి. అడ్మిషన్ కూడా అంత సులభం కాదు. ఈ స్కూల్ గురించి మీకు తెలిసే ఉంటుంది.
thank you for visiting my blog Narasimha rao garu. ఆ స్కూల్ గురించి తెలుసండి. నా కజిన్ పిల్లలు అక్కడే చదివారు. మంచి స్కూల్.
Post a Comment