Tuesday, April 28, 2020

అస్పష్టం

నీకేమో నేను గుర్తొచ్చినప్పుడు మాత్రమే
నాకు మాత్రం నా గుర్తే నువ్వు..

చిరుజల్లుల సవ్వడివీ నీవే
జడివానపు అలజడివీ నువ్వే

సప్తతురగుడి వెచ్చని కిరణమూ నువ్వే
మృగధరుడి అమృత తరంగిణీ నువ్వే

సంధ్యాకాశపు కెంజాయా నువ్వే
నిశిరాతిరి జాగరమూ నువ్వే

ఊహల శిఖరపు అంచున నువ్వు
భావపు కెరటాలపై జాలువారే 
నీ ఛాయకై వెతుకుతూ నేను

కలల కుటీరపు మొగసాల నిలబడి
లోనికి తొంగి చూశాను..నీ కోసం

My disinfectant hand wash

I dried some neem leaves in shade and made  powder in mixie. It won't become fine powder unless we sieve it. Take some water and add some neem powder, pinch of turmeric and we can even add seekaya powder.

I know there is no scientific evidence for this. Just wanted to give some entertainment for science freaks.

Friday, April 3, 2020

#cynic batch

దీపాలు వెలిగించమంటే దీపాలు ఆర్పమన్నారు అని మాత్రమే వినిపించుకునే చెవిటివాళ్ళు.
దేశం కష్ట కాలంలో ఉంది, మనందరం ఒకరికొకరం తోడున్నాం, ధైర్యం కోల్పోవద్దు అనే సంఘీభావం అందులో వీళ్ళకి కనిపించదు.

 ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలతో తగ్గుముఖం పట్టిన వైరస్ ఒక్కసారిగా ఎందుకు ఎక్కువయిందో తెలిసి కూడా, ఆ వీడియోలు చూస్తూ కూడా వాళ్ళ మీద మాత్రం ధైర్యంగా నోరెత్తలేని అసమర్థులు. 

హాయిగా లివింగ్ రూముల్లో కూర్చుని కులాసాగా కాళ్ళూపుకుంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ సోషల్ మీడియాల్లో కువిమర్శలు గుప్పిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్న వీళ్ళు మళ్లీ ఒక్క అడుగు కూడా బయట పెట్టరు. వీళ్ళకి విమర్శించటం తప్ప ఇంకో పని ఉండదు, రాదు కాబోలు. ఒక చిన్న కుటుంబంలోనే ఏదైనా సమస్య వస్తే ఒక్కోసారి దిక్కు తోచదు..అలాంటిది కొన్నికోట్ల జనాభా ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటుంది! మనం వెళ్లి ప్రత్యక్షంగా సేవలు చేయలేకపోయినా అడ్డదిడ్డంగా, అదే పనిగా విమర్శించకుండా , సానుకూలంగా స్పందించటం మన కనీస ధర్మం, కర్తవ్యం. పనీ పాటా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక రంధ్రాన్వేషణ చేస్తూ ఎత్తి పొడుస్తూ, వ్యంగ్యం చేస్తూ ఉండటం హేయమయిన పని.. ఒక్క కరోనా విషయంలోనే కాదు..ఏ సందర్భం లో అయినా.

ఇంత పెద్ద వ్యవస్థని, జనాభా ఉన్న దేశాన్ని, అన్ని విభాగాలనీ సమన్వయం చేసుకుంటూ, నడిపించేటప్పుడు అక్కడక్కడా పొరపాట్లు దొర్లటం అత్యంత సహజం. సాధ్యమయినంత వరకు అంతా సజావుగా జరగాలనే ఎవరయినా కోరుకుంటారు. 

రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల్ని క్రికెట్ స్కోర్ లా చెప్పుకుంటూ పైకి తెగ బాధ పడిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కానీ ఈ cynic batch కి అంత సున్నితమైన మనసేమీ లేదు. వాళ్ళ అసలు రూపం ఏమిటంటే వాళ్ళిప్పుడు గోతి దగ్గర నక్కల్లా కాచుకుని ఉన్నారు ఎప్పుడెప్పుడు పరిస్థితి విషమిస్తుందా, ప్రభుత్వం మీద ఇంకెంత బాగా విషం కక్కచ్చా అని ఒకలాంటి పైశాచికానందం కోసం ఎదురు చూస్తున్నారు. భగవంతుడు వీళ్ళకి ఆ ఆనందం ఎప్పటికీ దక్కనివ్వకూడదు.
ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ఇలానే ఉంటారు. అత్యంత దయనీయమైన, దౌర్భాగ్యపు మనస్తత్వమే వీళ్ళ సమస్య. 
వీళ్ళని ఎవరికైనా చూపించండిరా