Friday, June 5, 2020

పూర్ణం

నీ నడక అటు నా నడక ఇటు
ఒకే దారిలో

నీ చూపు అటు నా చూపు ఇటు
కనే కల ఒకటే

నీ మాట నీది నా మాట నాది
భావం ఇద్దరిదీ

నువ్వక్కడ నేనిక్కడ
ఇద్దరి లోకం ఒకటే

నీ లెక్క నీది నా లెక్క నాది
వచ్చేది ఒకటే విలువ

నువ్వో సగం నేనో సగం
అయిందిగా పూర్ణం

Thursday, May 14, 2020

#quarantine

ఆరోజు మా పెద్దబాబు పుట్టిన 7వ రోజు. మర్నాడు నాకు కుట్లు విప్పి ఇంటికి పంపిస్తారు. ఏడో రోజు పొద్దుటి నుంచీ నాకు జ్వరం, సాయంత్రానికి ఒంటిమీద అక్కడక్కడా బొబ్బల్లాంటి పొక్కులు కనిపించాయి. డాక్టర్ గారు రౌండ్స్ కి వచ్చినప్పుడు చూసి 'chicken pox,(ఆటలమ్మ/పొంగు) ఇక్కడ హాస్పిటల్ లో ఉండకూడదు, ఈ రూమ్ వెంటనే sterilize చెయ్యాలి, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను' అని అప్పటికప్పుడు కుట్లు విప్పేశారు. నిమిషాల మీద ఖాళీ చేయించారు. 
నన్ను బాబు దగ్గర ఇంట్లో ఉంచద్దు, ఇంకెక్కడైనా పెట్టమన్నారు. నన్ను ఉంచటానికి హైదరాబాద్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ కీ ఫోన్ చేశారు.  అడ్మిట్ చేస్కోటానికి ఏ హాస్పిటల్ కూడా ఒప్పుకోలేదు. చివరికి Barkatpura, woodlands హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకున్నారు, రూమ్ కి ఎక్కువ కడతాము అని ఒప్పందం మీద.
బాబు మా వాళ్ళింటికి, నేను హాస్పిటల్ కి.  రోజూ అమ్మ వచ్చి సాంబ్రాణి పొగ వేసేది. పక్క మీదకి వేపాకులు. 12 రోజులు అక్కడే ఉన్నాను. ఇంతాచేసి బాబుకి కూడా వచ్చిందిట. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు. కాకపోతే చాలా తక్కువగా..అక్కడక్కడా. వయసును బట్టి దాని తీవ్రత పెరుగుతుందని చెప్పారు.  నాకు తగ్గి ఇంటికి వచ్చాను..నా husband కి వచ్చేసింది.
ఇంతకీ నా సందేహం ఏమంటే మన పల్లెటూళ్ళు, చిన్న చిన్న ఊర్లల్లో  ఆటలమ్మ అంటే ఇంత హంగామా చేస్తారా అసలు? స్కూల్ మానిపిస్తారు, ఇంట్లోనే ..అంతగా అయితే వేరేగా ఉంచుతారు. అంతే..అనుకుంటున్నాను!?

Monday, May 11, 2020

తుఫాను పెళ్లి - మచిలీపట్టణం10 May 1990

8 May

అప్పటికి 2,3 రోజుల నుంచీ కొద్దిగా ముసురు పట్టింది. ఆరోజు కొంచెం వర్షం ఎక్కువయ్యింది.
దగ్గరి బంధువులు కొంతమంది వచ్చి ఉన్నారు. మర్నాడు పొద్దున్న కళ్యాణమండపానికి వెళ్ళాలి. ఆరోజు రాత్రి వైజాగ్ లో మగ పెళ్ళివారు ట్రైన్ లో బయలుదేరుతున్నారు. మర్నాడు పొద్దున్నకి గుడివాడలో దిగుతారు. అక్కడినుంచీ బందరుకి పెళ్ళివారిని తీసుకు రావటానికి RTCబస్ మాట్లాడాము.  కళ్యాణ మండపానికి తీసుకు వెళ్లాల్సిన సామానంతా సద్దుతున్నారు. అప్పటికి మా ఇంట్లో ఫోన్ కనెక్షన్ లేదు.
మా ఇంటికి 4km దూరంలో అమ్మ cousin  ఉండేవారు. రాత్రి పొద్దుపోయింది. వర్షం బాగా పడుతోంది. ఆ వర్షంలో అమ్మ cousin వచ్చి మగ పెళ్ళివారు నుంచీ ఫోన్ వచ్చిందని చెప్పారు..తుఫాను కారణంగా ట్రైన్ గుడివాడ కాకుండా బెజవాడకి divert చేస్తున్నారుట. బుక్ చేసిన బస్ వేస్ట్ అయిపోయింది. బెజవాడ కి బస్ బుక్ చేసే టైం లేదు. మర్నాడు పొద్దున్న మా కక్క (నాన్నగారి చిన్న తమ్ముడు) బెజవాడ వెళ్లి అక్కడ 4, 5 టాక్సీ లు మాట్లాడి పెళ్ళివారిని తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు.

9 May
వర్షం సన్నగా పడుతూనే ఉంది. అందరం కళ్యాణమండపానికి రిక్షాల్లో బయలుదేరాము. కక్క బెజవాడ వెళ్లారు. మొత్తానికి పొద్దున్న10 గంటలకు పెళ్ళివారు వచ్చారు. వర్షం పెద్దది అయింది. గాలి కూడా మొదలయింది. వచ్చే దారిలో చెట్లు పడిపోయి ఉన్నాయని చెప్పారు. ఎదుర్కోలు కార్యక్రమం, అల్పాహారం కార్యక్రమం అవగానే  ఇద్దర్నీ పెళ్ళికొడుకు, పెళ్లికూతురు చేశారు. స్నానాలు, పలకరింపులు, నవ్వులతో భోజనాల కార్యక్రమం కూడా అయిపోయింది. 3, 4 గంటలకి పరిస్థితి అర్ధమయింది. భయం, టెన్షన్ మొదలయ్యాయి. సాయంత్రం వరపూజ, ప్రదానం ఉన్నాయి. అవేవీ జరిగే పరిస్థితి లేదని అర్ధం అయిపోయింది.
వంటాయన అలానే రాత్రి బిస్రూటా భోజనం తయారు చేశారు. రాత్రి 7 దాటిన దగ్గరినుంచీ తుఫాను తన విశ్వరూపం చూపించటం మొదలయింది. కరెంట్ పోయింది. జనరేటర్ ఉంది కానీ అది వేసే మనిషి లేడు. వంటాయన పెళ్లి కోసం తెచ్చిన పాలికల్లో నూనె పోసి బట్టని ఒత్తిగా చేసి పెళ్లి మండపం చీకటిలో లేకుండా చూశారు. అందరం ఆ దీపం చుట్టూ చేరి భోజనాలు అయ్యాయి అనిపించాము.
నెమ్మదిగా కళ్యాణమండపం గదులలోకి నీళ్లు రావటం మొదలయింది. అందరం గబ గబా ఇనుప మడత కుర్చీల మీదకి పెళ్లి సామాను అంతా ఎక్కించాము.
హాల్ లో పైన ventilators, కిటికీలకి ఉన్న అద్దాలు (మూసిఉన్నవే)గాలికి భళ్ళున పగలటం మొదలయ్యింది. హాలంతా గాజుపెంకుల వర్షం. అందరం బిక్కు బిక్కు మంటూ హాల్ మధ్యలోకి చేరాము. కొంతమంది కుర్చీలు వరసగా వేసుకుని, కొంతమంది కింద పడుకుని..ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా గడిపాము. ఆ రాత్రి లైటింగ్ కోసం చేసిన decoration  అంతా ఎప్పుడో కొట్టుకుపోయింది. ఇంకా రావాల్సిన బంధువులు అంతకు ముందురోజే ప్రయాణం క్యాన్సల్ చేసుకున్నారు..టీవీ లో వార్తలు చూసి. మా వాళ్లలో అంతకు ముందెప్పుడూ జీవితంలో తుఫానుని చూడని వాళ్ళు ప్రకృతి బీభత్సం, అది చేసిన విలయతాండవం కళ్లారా చూశారు.
ఆడపిల్ల తల్లిదండ్రులు గా మా అమ్మ నాన్నలు పడే టెన్షన్ చెప్పేదేముంది. మా పురోహితులు, (నా స్నేహితురాలి తండ్రి) శ్రీ లంకా సత్యనారాయణ గారు వాళ్ళకి ధైర్యం చెప్పారు..'బెంగ పడకండి. ఎట్టి పరిస్థితుల్లో నూ పెళ్లి ఆగదు, నేను పెట్టిన ముహూర్తబలం అలాంటిది' అని సముదాయించారు. ఆ కాళరాత్రి ఎప్పుడు గడుస్తుందా, తుఫాను ఎప్పుడు శాంతిస్తుందా అని అందరం దేముడిని ప్రార్ధిస్తూ గడిపాము.

10 May
అతి నెమ్మదిగా తెల్లారింది. బైట తుఫాను వదిలి వెళ్లిన బీభత్స దృశ్యాలు..చుట్టూ మొలలోతు నీటిలో ..ద్వీపంలా ఉన్న కళ్యాణమండపం. రాత్రి హాల్ లో  పడిన గాజు పెంకులన్నీ బక్కెట్లలోకి ఎత్తిపోశారు పనివారు. రాత్రి కురిసిన గాజు పెంకుల వర్షంలో గాజు ముక్క ఒకటి వచ్చి వంటాయన చేతికి తగిలి పెద్ద గాయం అయింది. పాపం ఆయన ..ఏం పర్లేదు ..అని తనే, కండువాతో కట్టు కట్టేసుకుని అలానే పనిలోకి దిగిపోయాడు. ఇంకా ఎన్నెన్నో ఇబ్బందులు. పొద్దున్న కోసం రావాల్సిన పాలు రాత్రి తుఫానులో కొట్టుకుపోయాయి. పాలు ప్యాకెట్స్ తట్టలో పెట్టుకుని తెస్తుంటే ఏకంగా తట్ట ఎగిరిపోయిందిట. అతను కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్లి తలదాచుకున్నాడుట పాపం.  వంటాయన ముందు చూపుతో పాల పొడి cans తెచ్చిపెట్టుకోటం కొంతవరకు సరిపోయాయి. కొంతమంది బ్లాక్ కాఫీ, టీ తాగారు. వాతావరణం మాత్రం తుఫాను చాయలేవీ లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. కొద్దిగా ఎండ కూడా వచ్చింది. రెండు రోజుల్లో తీరికగా అవుతాయనుకున్న పెళ్లి కార్యక్రమాలు ఒక్క రోజులో అవగొట్టాలి. గబ గబా మంగళ స్నానాలతో మొదలై కులదేవత, స్నాతకం, వరపూజ, ప్రదానం, కాశీ యాత్ర చక చకా అయిపోయాయి. మా ఇంకో కక్క లారీ, బస్, ట్రాక్టర్..ఇలా ఇన్ని వాహనాలు ఎక్కి కష్టపడి ముహూర్తం సమయానికి వచ్చారు. సాయంత్రం గౌరీపూజ, పెళ్లి. ఊళ్ళో పెళ్లికి పిలిచిన స్నేహితులు, బంధువులు.. వారెవ్వరూ రాలేని పరిస్థితి. కాకపోతే నాన్నగారిది పెద్ద కుటుంబం,  నా (మేన)అత్త గారి ఫామిలీ కూడా పెద్దది అవటం వలన ఉన్న వాళ్ళతోనే చాలా సందడిగా, చాలా సంతోషంగా జరిగింది పెళ్లి. మా దొడ్డప్పలు, దొడ్డమ్మలు, కక్కలు, కక్కిలు ఎంతో అండగా నిలబడ్డారు. నా cousins అందరూ నాకు తోబుట్టువులు లేని లోటు తెలీకుండా ప్రేమగా నా పక్కనే ఉండి పెళ్లి జరిపించారు.
ముందు అనుకున్న ప్రకారం మర్నాడు పొద్దున్న అందరం మా ఇంటికి వెళ్లి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. కానీ రోడ్లు ఇంకా మోకాలి లోతు నీళ్లలో మునిగి ఉండటం, రిక్షాలు లేకపోటం, ఇంటి దగ్గర కూడా అల్లకల్లోలంగా ఉండటంతో మర్నాడు కూడా కళ్యాణ మండపం లోనే వ్రతం , భోజనాలు కానిచ్చి వెళదామనుకున్నాము.

11 May
పొద్దున్నే కబురు..కళ్యాణమంటపాన్ని తుఫాను బాధితులకు వసతి చెయ్యాలని కలెక్టర్ గారి ఆదేశం. వీలయినంత త్వరగా ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడే తుఫాను బాధితుల కోసం వంటలు కూడా మొదలు పెట్టేశారు. ఈ లోగా బెజవాడ వరకు కొన్ని బస్సులు వెళ్తున్నాయని తెలిసింది. హైదరాబాద్ నుంచీ వచ్చిన బంధువులు, వైజాగ్ నుంచీ వచ్చిన మగ పెళ్ళివారు పాపం అలానే నీళ్లలోనే బస్ స్టాప్ కి వెళ్లిపోయారు. అందరికీ విజయవాడ నుంచీ ట్రైన్స్ రిజర్వేషన్ అయింది మరి.
ఇక్కడ మా చేత వ్రతం అయిందనిపించేశారు.
అప్పటికే జనాలు ఒక్కసారిగా రావటం, పాపం ఆకలి మీద ఉన్న వాళ్ళని ముందు భోజనాల హాల్ లోకి తీసుకువెళ్లారు. మెయిన్ హాల్ లోకి వాళ్ళొచ్చే లోగా మేము బైట పడ్డాము. సగం చక్రాలు మునిగిన రిక్షాల్లో నెమ్మదిగా ఇంటికొచ్చాము. కరెంట్ రావటానికి 10 రోజులు పట్టింది. 'most memorable marriage' గా అందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది.
ముహూర్తబలం అంటే ఇదేనేమో! ఆ ముహూర్తానికి అవ్వాల్సిన పెళ్లిళ్లు కొన్ని ఆగిపోయాయనీ, కొన్ని బస్ స్టాండుల్లో కూడా పెళ్లిళ్ళు చేశారని తర్వాత  అందరూ అనుకుంటుంటే తెలిసింది.
అన్నిటికంటే చెప్పుకోవాల్సింది మా ఆఖరి ఆడపడుచు నిండు చూలాలు. రిస్క్ తీసుకుని తమ్ముడి పెళ్లికి వచ్చింది. తిరిగి వెళ్లేప్పుడు విజయవాడ స్టేషన్లో ఒక్కసారి వచ్చి పడిన జన ప్రవాహం లో తనని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించటానికి తన చుట్టూ ఒక వలయంలా అందరూ నుంచుని తీసుకు వెళ్లారుట. Reservation ఉన్నా జనాలు ఎక్కేయటంతో తన బెర్త్ ఒక్కటీ ప్రొటెక్ట్ చేశారు. ట్రాక్స్ దెబ్బతిన్నాయని ట్రైన్స్ రాజమండ్రి లో ఆపేశారు. మళ్లీ రైళ్లు నడవటం మొదలయ్యేదాకా అందరూ రాజమండ్రి లో ఉన్న కొంతమంది బంధువుల ఇళ్లల్లో 2,3 రోజులు గడపాల్సి వచ్చింది. వైజాగ్ స్టేషన్ నుంచీ  సరాసరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఆడపడుచును. దేముడి దయవలన అంతా శుభమే జరిగింది.
మొత్తానికి  మే10 1990 నాడు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వింత పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే  ఇదో వింత పరిస్థితి...లాక్ డౌన్.

Tuesday, April 28, 2020

అస్పష్టం

నీకేమో నేను గుర్తొచ్చినప్పుడు మాత్రమే
నాకు మాత్రం నా గుర్తే నువ్వు..

చిరుజల్లుల సవ్వడివీ నీవే
జడివానపు అలజడివీ నువ్వే

సప్తతురగుడి వెచ్చని కిరణమూ నువ్వే
మృగధరుడి అమృత తరంగిణీ నువ్వే

సంధ్యాకాశపు కెంజాయా నువ్వే
నిశిరాతిరి జాగరమూ నువ్వే

ఊహల శిఖరపు అంచున నువ్వు
భావపు కెరటాలపై జాలువారే 
నీ ఛాయకై వెతుకుతూ నేను

కలల కుటీరపు మొగసాల నిలబడి
లోనికి తొంగి చూశాను..నీ కోసం

My disinfectant hand wash

I dried some neem leaves in shade and made  powder in mixie. It won't become fine powder unless we sieve it. Take some water and add some neem powder, pinch of turmeric and we can even add seekaya powder.

I know there is no scientific evidence for this. Just wanted to give some entertainment for science freaks.

Friday, April 3, 2020

#cynic batch

దీపాలు వెలిగించమంటే దీపాలు ఆర్పమన్నారు అని మాత్రమే వినిపించుకునే చెవిటివాళ్ళు.
దేశం కష్ట కాలంలో ఉంది, మనందరం ఒకరికొకరం తోడున్నాం, ధైర్యం కోల్పోవద్దు అనే సంఘీభావం అందులో వీళ్ళకి కనిపించదు.

 ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలతో తగ్గుముఖం పట్టిన వైరస్ ఒక్కసారిగా ఎందుకు ఎక్కువయిందో తెలిసి కూడా, ఆ వీడియోలు చూస్తూ కూడా వాళ్ళ మీద మాత్రం ధైర్యంగా నోరెత్తలేని అసమర్థులు. 

హాయిగా లివింగ్ రూముల్లో కూర్చుని కులాసాగా కాళ్ళూపుకుంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ సోషల్ మీడియాల్లో కువిమర్శలు గుప్పిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్న వీళ్ళు మళ్లీ ఒక్క అడుగు కూడా బయట పెట్టరు. వీళ్ళకి విమర్శించటం తప్ప ఇంకో పని ఉండదు, రాదు కాబోలు. ఒక చిన్న కుటుంబంలోనే ఏదైనా సమస్య వస్తే ఒక్కోసారి దిక్కు తోచదు..అలాంటిది కొన్నికోట్ల జనాభా ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటుంది! మనం వెళ్లి ప్రత్యక్షంగా సేవలు చేయలేకపోయినా అడ్డదిడ్డంగా, అదే పనిగా విమర్శించకుండా , సానుకూలంగా స్పందించటం మన కనీస ధర్మం, కర్తవ్యం. పనీ పాటా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక రంధ్రాన్వేషణ చేస్తూ ఎత్తి పొడుస్తూ, వ్యంగ్యం చేస్తూ ఉండటం హేయమయిన పని.. ఒక్క కరోనా విషయంలోనే కాదు..ఏ సందర్భం లో అయినా.

ఇంత పెద్ద వ్యవస్థని, జనాభా ఉన్న దేశాన్ని, అన్ని విభాగాలనీ సమన్వయం చేసుకుంటూ, నడిపించేటప్పుడు అక్కడక్కడా పొరపాట్లు దొర్లటం అత్యంత సహజం. సాధ్యమయినంత వరకు అంతా సజావుగా జరగాలనే ఎవరయినా కోరుకుంటారు. 

రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల్ని క్రికెట్ స్కోర్ లా చెప్పుకుంటూ పైకి తెగ బాధ పడిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కానీ ఈ cynic batch కి అంత సున్నితమైన మనసేమీ లేదు. వాళ్ళ అసలు రూపం ఏమిటంటే వాళ్ళిప్పుడు గోతి దగ్గర నక్కల్లా కాచుకుని ఉన్నారు ఎప్పుడెప్పుడు పరిస్థితి విషమిస్తుందా, ప్రభుత్వం మీద ఇంకెంత బాగా విషం కక్కచ్చా అని ఒకలాంటి పైశాచికానందం కోసం ఎదురు చూస్తున్నారు. భగవంతుడు వీళ్ళకి ఆ ఆనందం ఎప్పటికీ దక్కనివ్వకూడదు.
ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ఇలానే ఉంటారు. అత్యంత దయనీయమైన, దౌర్భాగ్యపు మనస్తత్వమే వీళ్ళ సమస్య. 
వీళ్ళని ఎవరికైనా చూపించండిరా

Sunday, March 29, 2020

కరోనా బ్లాగింగ్ 🙂

సహజంగా మన భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. దానికి కారణం మన పూర్వీకులు మనకు ఇచ్చిన జీవన విధానం. పిల్లలని చిన్నప్పటి నుంచీ అన్ని రకాల వాతావరణాలకి అలవాటయ్యేలా rough and tough గా పెంచుతాము. కానీ అన్నీ వెస్ట్ నుంచీ అరువు తెచ్చుకున్నట్టే దురదృష్టవశాత్తు పిల్లల్ని పెంచే పద్ధతి కూడా అక్కడి నుంచీ వాత పెట్టుకుంటూ పిల్లల్ని నానా సూకరాలతో పెంచుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు కొంతమంది.

Tuesday, March 24, 2020

🤔

ఇదివరకు కొంతమంది 'చాదస్తులు' గాస్ సిలిండర్ వచ్చినప్పుడు దానికి శుభ్రంగా స్నానం చేయించిగానీ ఇంట్లోకి తెచ్చేవారు కాదు. అది చూసి తెగ నవ్వుకునే వాళ్ళం. ఈరోజు నేను అదే పని చేశాను. కాకపోతే sanitizer తో. 
కానీ ఇప్పుడు ఓ సందేహం వస్తోంది..మళ్లీ నీళ్లతో కడగాలా అని. అసలే అది గాస్.. ఇది alcohol 🔥

Monday, March 23, 2020

😖

You may think 'thank God, it is over now' but actually it is not over and you cannot relax.

If you think 'it is ok..there is no hurry..and can wait'  feeling lazy  to act promptly..It would be a disaster for you only. You double the risk for yourself...and ofcourse sometimes for others also..

If you have small kids, grown-up kids or even adult kids you have to check every nook and corner and make sure there is nothing left

No matter how many times you wash, how much time you wash
They keep coming...
Dishes to be washed.

Wednesday, March 18, 2020

వీళ్ళింతే..

Verbal diarrhea తో బాధపడే మేతావుల్లాగే
కరోనా వైరస్ ని శాయశక్తులా ఎదుర్కోటానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలని జీర్ణించుకోలేక constipation తో బాధపడే మేతావులు కూడా ఉన్నారు. 

Tuesday, January 28, 2020

ఉండుండి..

ఉండుండి పొంగే నీ ప్రేమ..
అడపతడప కురిసే చిత్తడివాన
అప్పుడప్పుడూ పలకరించే మందానిలము
ఎప్పుడో ఓసారి మూత తీసే అత్తరు సీసా నుంచీ వచ్చే మెత్తటి నెత్తావి..

Sunday, January 26, 2020

ఎఱ్ఱబూటాలు వేరైన ఆకుపచ్చ చీర




Yesterday while we were going to Vedadri we saw a farmer loading the truck with this yummy, beautiful and farm fresh red mirchi from his farm. గుంటూరు పండు మిరప్పళ్ల పచ్చడి తలుచుకోగానే నోరూరిపోయింది.  So we stopped and asked him can he sell some mirchi. But to our utter disappointment he said, 'this is the first crop and filled with pesticides. So this crop should not be consumed and is used in dyeing industry only. Only from second crop we can consume. How honest he is!!. Pch. Very much disappointing and greedily, desperately i asked him whether we can wash them thoroughly, and use. Pch..He said no. I couldn't help i took some fist full. Now arguments are going on at home. I thought Atleast i can dried them for seeds . But again a no from home folk ...They say seeds contain more pesticides...🙄😪...