ఆత్మీయుల మరణం తర్వాత వారు వాడిన వస్తువులలో వారిని తలచుకోవడం ఒక అసంకల్పిత చర్య. వారు భోజనం చేసిన పళ్లెం కావచ్చు, కాఫీ తాగిన గ్లాస్ కావచ్చు, పాటలు, వార్తలు విన్న రేడియో కావచ్చు, రోజూ కూర్చున్న కుర్చీ, వాడిన బట్టలూ ..ఇలా ఏదైనా..
మొదట్లో కొంతకాలం వాటిని చూసినప్పుడల్లా కడుపులో సుళ్ళు తిరుగుతూ మొదలైన దుఃఖం ఉప్పెనలా కళ్లలో నుంచి దుముకుతూ ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ కంటనీరు చెలమల్లాగా ఊరుతూ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదని తెలిసినా జ్ఞాపకాలలో, వారికి చెందిన వస్తువులలో వారు బ్రతికే ఉన్నట్టు మనసు భ్రమిస్తూనే ఉంటుంది..ప్రియంగా వారిని తలుచుకుంటూనే ఉంటుంది.
ఫిలిప్స్ కంపెనీ కి చెందిన ఈ సైకిల్ మా నాన్నగారు 1950ల్లో కొన్నారుట. తన చివరి వరకూ చాలా అపురూపంగా చూసుకునే వారు. తనకి 88, 89 వయసు వరకూ కూడా అప్పుడప్పుడు సరదాగా తొక్కేవారు. ఎప్పటికప్పుడు తుడవడం, గాలి కొట్టించడం చేసేవారు. సైకిల్ బిగుసుకు పోకుండా ఉండటానికి వాచ్ మాన్ ని తొక్కమనేవారు.
No comments:
Post a Comment