Monday, June 19, 2023

అసంపూర్ణ రామాయణం అనబడే ఆదిపురుష్



పసలేని, పేలవమైన సమర్ధింపులు ఎన్ని విన్నా మనసుకు ఏ మాత్రం నచ్చని, గుచ్చుకునే, వెగటు పుట్టించే, వెకిలి సినిమా.  పిల్లల లేత మనసులో ఇది రామాయణం అని ముద్ర పడకుండా, indian version of avengers అని చెప్పి సినిమా చూపిస్తే మంచిది.  

6, 7 నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు వ్యతిరేకించి, ట్రోల్ చేసిన వాళ్లే, latest trailor వచ్చినప్పుడు, ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత  హఠాత్తుగా సమర్ధించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.  సినిమా ప్రోమోటర్స్ స్ట్రాటజీ  బాగానే పనిచేసిందని చెప్పచ్చు.  

మరి అయితే  boycott లాల్ సింగ్ చెడ్డా, boycott పఠాన్ ..ఇవన్నీ ఎందుకు చేసినట్టు? P K గురించి గింజుకున్నది ఎందుకు? 

 కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ...ఇవన్నీ freedom of creativity తో కల్పితం, అంతమంది పోలేదు అంటూ ఆ 'గిట్టనివాళ్ళు'  సమర్ధించుకుంటే తప్పేముంది?  మనం ఎందుకు బాధతో మెలికలు తిరిగాము?  (ఆ సంఘటనల బాధితులకు, దర్శక నిర్మాతలకు క్షమాపణలతో🙏🏻).

 ఎక్కడైనా, ఎప్పుడైనా అసత్యాన్ని సమర్ధించకూడదు.

ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  అసలైతే చర్చించేందుకు కూడా అర్హత లేని సినిమా.  ఖచ్చితంగా వక్రీకరణే.  

తన కళ్ళ ఎదుటే రావణాసురుడు సీతని ఎత్తుకు పోతుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయిన 'రాఘవ' అనే  వ్యక్తి కధ మాత్రమే ఇది.

  పిరికిపందలా నీళ్ళల్లో ఇంద్రజిత్తుని చంపిన 'శేషు' కథ మాత్రమే ఇది.  
  
'భజ్రంగ్'  అదే..హనుమంతుడు, ఇంకా సాక్షాత్తు రాముడే ఆశ్చర్యపోయే లాంటి తేజస్సుతో వెలిగిపోయే రావణుడు లేడు ఇందులో,  వెగటు పుట్టించే ఆకారం తప్ప. 

 దివ్యంగా మెరిసిపోయే లంక లేదు ఇక్కడ పాడుపడినట్టున్న గబ్బిలాల కొంప తప్ప.
 
  సీతతో సమానమైన పతివ్రత మండోదరి లేదు ఇక్కడ, ఓ అర్భకురాలు తప్ప.  
  
విభీషణుడి భార్య (ఈవిడెక్కడి నుంచీ వచ్చిందో మరి) చెప్తే కానీ సంజీవిని గురించి రాముడి సైన్యంలో ఎవరికీ తెలీదు.. పాపం.
  
సంస్కృతం లో నుంచీ true translation కాబోలు.. ఉతికేస్తాను, నీ బాబు.  

సినిమా నుంచీ బయటికొచ్చిన తర్వాత నా పిల్లలు అన్నమాట..'ఇది రామాయణం కాదు'.  (వాళ్ళు వాల్మీకి రామాయణం  చదివారు)

ఈ సినిమా దర్శకుడో, రచయితో..వాళ్ళ మాట కూడా ఇదే అనుకుంటా.  వాళ్ళ వ్యాపారం కోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారు.  మనం కూడా అప్పుడప్పుడు పడిపోతుంటాము.

4 comments:

విన్నకోట నరసింహా రావు said...

సరిగ్గా లేదంటూ సమీక్షలు వస్తున్నా కూడా ఈ చిత్రాన్ని చూసే రిస్క్ ఎందుకు తీసుకున్నారు 😳?

అంతా వ్యాపారమయమైపోయింది. విలువలు, సామాజిక బాధ్యత లాంటివి వాళ్ళకు పట్టవు.

విన్నకోట నరసింహా రావు said...

మధ్యలో సీత కష్టాలు సీతవండోయ్ 🙂.
ఇవాళ్టి (21-06-2023) Deccan Chronicle Hyd supplement లో మొదటి పేజీలో వార్త - ఈ చిత్రంలో ఓ డయలాగులో సీతని daughter of India (ఇంగ్లీషులో కాకపోవచ్చు లెండి, మొత్తానికి అదే అర్థంలో) అని వర్ణించారని నేపాల్ ఆగ్రహం వెలిబుచ్చారట. ఆఁయ్, మా నేపాల్ రాజకుమారిని భారతదేశ పుత్రిక అంటారా అని వాళ్ళ అభ్యంతరంట. 🙂.

ఈ లెక్కన గౌతమ బుద్ధుడిని కూడా (నేపాల్ లోని లుంబిని నగరంలో జననం కదా) son of India అంటే నేపాల్ వారు ఒప్పుకోరేమో 😁?

bonagiri said...

వై దిస్ కొలవెరి రౌత్?

విన్నకోట నరసింహా రావు said...

ఇటువంటి కొలవెరి వాళ్ళని “Forgive them, for they do not know what they are doing” అన్న క్రీస్తు పలుకుల్ని గుర్తుకు తెచ్చుకుని, అయ్యో పాపం అని వదిలెయ్యడమే, బోనగిరి గారు.

We are the best thing that has happened to this world అనే భ్రమలో పడిపోయుంటారేమో సినిమా వాళ్ళు అనిపిస్తుంటుంది నా మటుకు. ఆ భ్రమ వలన తాము ఏది చేసినా కరక్టే అని నమ్ముతుంటారేమో? వాళ్ళని దేవుళ్ళలాగా ఆరాధించే సామాన్య ప్రజలు కూడా ఓ కారణం. దాని వలన పురాణ పాత్రలను కూడ వదలక పోవడం తమ హక్కు అనుకుంటారేమో?