Thursday, April 18, 2019

ఇంక...

హంగూ ఆర్భాటాలు, కోరికల చిట్టాలతో కాదు,
నిష్కామంగా, నగ్నమైన మనసుతో ధ్యానించుదామా

బాధ్యతలు బరువులు అని రాద్ధాంతం మాని
కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగుదామా

ఎంత ప్రాప్తం, ఏది ప్రారబ్ధం
విధి చేసే మాయా మర్మం తెలియతరమా

డాంబికం, పటాటోపాలలో సంతోషాన్ని వెతకడం మాని
సహజమైన ఆనందాలను చవిచూద్దామా

శుష్కవాదనలూ, ఆవేశకావేషాలు వీడి
హృదయాన్ని మలయమారుతంలా మార్చుకుందామా...ఇంక!!

సమయమింకా మించిపోలేదు!!

No comments: