Sunday, April 21, 2019

అర్జునా..పార్ధా.. కిరీటీ..

చిన్నపుడు ఉరుముల శబ్దం అంటే చాలా భయపడేదాన్ని..ఎక్కడ నా పక్కనే పిడుగు పడుతుందో అని. ఆ శబ్దానికి నేను దడుచుకున్నప్పుడల్లా మా అమ్మ నా వీపు మీద ఒక్కటిచ్చేది..అదే తట్టేది. అసలు పిడుగు పడటం అంటే భగ భగ మండుతున్న పెద్ద బండరాయి ఆకాశం నుండి పడుతుంది అనుకునేదాన్ని.
కానీ పెద్దదాన్ని అవుతున్నకొద్దీ ఉరుము రహస్యం తెలిసిపోయింది.  ఇప్పుడు నేను చాలా expert అయిపోయాను..ఎంత మెరుపుకి ఎంత ఉరుము వస్తుందో ..ఆ మెరుపుని బట్టి ముందరే గట్టిగా చెవులు మూసుకోటంలో.

(ఇంతకీ నా భయం ఉరుము శబ్దానికా లేక పిడుగు పడుతుందనా..? ఇప్పటికీ అర్ధం కాదు.)

Thursday, April 18, 2019

ఇంక...

హంగూ ఆర్భాటాలు, కోరికల చిట్టాలతో కాదు,
నిష్కామంగా, నగ్నమైన మనసుతో ధ్యానించుదామా

బాధ్యతలు బరువులు అని రాద్ధాంతం మాని
కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగుదామా

ఎంత ప్రాప్తం, ఏది ప్రారబ్ధం
విధి చేసే మాయా మర్మం తెలియతరమా

డాంబికం, పటాటోపాలలో సంతోషాన్ని వెతకడం మాని
సహజమైన ఆనందాలను చవిచూద్దామా

శుష్కవాదనలూ, ఆవేశకావేషాలు వీడి
హృదయాన్ని మలయమారుతంలా మార్చుకుందామా...ఇంక!!

సమయమింకా మించిపోలేదు!!

Wednesday, April 10, 2019

Tuesday, April 9, 2019

Assamese spice in Telugu soil అస్సాం ఘాటు తెలుగింట్లో

We bought some Bhut Jolokia chillies when we visited Assam in December. I prepared some pickle and paste with the chillies and dried some seeds to plant and want to see if they will grow in Hyderabad's climate. Luckily almost all seeds sprouted well. I observed that their leaves are bigger than normal chilli plant. I am so happy, they are growing slowly, without any manure.
Hoping and eagerly waiting for the yield. Its enough for me even if the plants yield only one mirchi, I will be happy.


Saturday, April 6, 2019

చేదుకూడా మోదమే!!

చేదుగా ఉన్నా
గమ్మత్తయిన కమ్మని గుబాళింపుతో
ఉగాది పచ్చడి కి ప్రత్యేకమైన రుచిని
తెచ్చిపెట్టే వేపపువ్వు
ఆకురాలు కాలంలో వచ్చే అస్వస్థతలనుంచీ శరీరాన్ని కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే..,
సుతిమెత్తటి రేకులతో, అతిసుకుమారమైన  వేపపూల నుంచీ వచ్చే పరిమళం
మనసుని కూడా ఆహ్లాదభరితం చేస్తుంది  కదా!!