కొన్ని 'అనివార్య కారణాల' వల్ల ఈరోజు కల్కి సినిమా చూడాల్సి వచ్చింది. హాలంతా కలిపి 20/30 మంది ఉన్నారు హాయిగా.. air pollution లేదు.
చెడ్డ పాత్రలని elevate చేసి, విలన్ లని మంచి వారుగా, వీరులుగా, హీరోలుగా చూపించి ఇతిహాసాలని తప్పుగా చిత్రీకరించడం అనే trend ఎప్పటినుంచో వస్తోంది..ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. ఇది కూడా అంతే..అంతా కలి ప్రభావం కాబోలు!
ఇంత కంటే చెప్పేదేం లేదు ఈ సినిమా గురించి.
ఈ మధ్యే వచ్చిన జై హనుమాన్ పూర్తిగా ఫాంటసీ చిత్రం. అందులో విభీషణుడిని చూపించినా ఆ పాత్ర, character ఔచిత్యం దెబ్బతినకుండా హుందాగా చూపించారు. పెద్ద బడ్జెట్ సినిమా కాకపోయినా టెక్నికల్ గా కూడా బాగుంది.
కల్కి సినిమా కూడా పూర్తి ఫాంటసీ గా తీసివుంటే బాధ అనిపించేది కాదు.
అమితాబ్ బచ్చన్ గారి తెలుగు dubbing అందరికంటే బాగుంది.
విజయదేవరకొండ అర్జునుడుగా చక్కగా ఉన్నాడు.
మన ఇతిహాసాలని, అందులోని పాత్రలను ఉన్నవి ఉన్నట్టుగా, నిజాయితీగా చూపించగలిగే సినిమాలు వచ్చే
ఆ రేపటి కోసం...!
2 comments:
ఎండమావుల నిరీక్షణ.
ఔనండీ
Post a Comment