ఇంట్లో Parkinson's, Dementia పేషెంట్ ఉన్నప్పుడు, అది జీవిత భాగస్వామి కావచ్చు , తల్లి లేదా తండ్రి అవచ్చు, వాళ్ళని చూసుకునే ప్రధాన caretaker కి చాలా ఓర్పు, సహనం అవసరం.
ఈ రోగం బారిన పడ్డవారికి కొన్ని Basic లక్షణాలు అందరికీ ఒకేలా ఉన్నప్పటికీ, కొన్ని లక్షణాలు మాత్రం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కోలాంటి లక్షణాలు లేదా సమస్యలు ఉంటాయి. బహుశా వాళ్ళ వాళ్ళ original personality ప్రభావం కూడా వాళ్ళ రోగ లక్షణాల మీద reflect అవుతూ ఉంటుంది. అలాగే శారీరకంగా వచ్చే సమస్యలు కూడా పేషెంట్ పేషెంట్ కీ మారుతూ ఉంటాయి.
ఈ వ్యాధికి ప్రస్తుతానికి మందులు లేవు. ఇప్పుడు ఉన్న మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడం లేదా వ్యాధి వేగంగా ముదరకుండా మాత్రమే చేయగలవు. అలాగే ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని కూడా లేదు. Family history లేకపోయినా రావచ్చు.
వ్యాధి ప్రారంభదశలో పేషెంట్ కీ, వారిని చూసుకునే వారికీ పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరేకొద్దీ పేషెంట్ కి తన సమస్య గురించిన స్పృహ ఎలాగూ ఉండదు. వారిని చూసుకునే immediate caretaker కి మాత్రం సహనానికి పెద్ద పరీక్ష.
ఆర్ధిక స్తోమత ఉంటే ఒక paid attendant ని పెట్టుకుంటే మంచిది. నగరాలలో ఈ parkinsons, dementia, Alzheimer వ్యాధులపై చాలా వరకు అవగాహన వచ్చింది. చిన్న ఊళ్ళల్లో అందరికీ వీటి గురించి ఇంకా తెలీదు. ముఖ్యంగా agency ల నుండీ వచ్చే అటెండెంట్స్ కి దీని గురించి అవగాహన ఉండదు. వాళ్ళకి ఈ వ్యాధి గురించి అర్ధమయేలా చెప్పాలి. ఎంత చెప్పినా ఒక్కోసారి వాళ్ళు అర్ధం చేసుకోక, చెయ్యలేక వెళ్లిపోతూ ఉంటారు. అటెండెంట్స్ మారినప్పుడల్లా పేషెంట్లు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీలయినంత వరకూ అటెండెంట్ ని మార్చకుండా చూసుకోవాలి. Attendants ని కూడా ఇంటి సభ్యుల లాగానే చూసుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. వాళ్ళూ మనుషులేగా!.
ప్రధానంగా పేషెంట్ ని చూసుకునే వారు సహనం కోల్పోకుండా, సంయమనంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం: ఈ సమస్యలతో బాధపడేవారికి తమ ప్రవర్తన పైనా, మాటలపైనా, శారీరకంగానూ, మానసికంగానూ తమ మీద తమకి నియంత్రణ ఉండదు. ఒకసారి మాట్లాడినట్టు ఒకసారి ఉండదు. ఇప్పుడు చెప్పినవి ఇప్పుడే మర్చిపోతారు. కోపం, చిరాకు, కుంగుబాటు, ఒక్కోసారి aggressive, agitated, తిట్టడం, violent గా కూడా ఉండచ్చు. వారు చేసే పని మీదా, వారి మాటల మీద, వారి ప్రవర్తన మీద వారికి స్పృహ ఉండదు. ఒక్కోసారి తెలివిగా, మామూలుగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళకి ఏమీ తెలివి ఉండి, తెలిసీ ఇవన్నీ చెయ్యరు. కాబట్టి వారితో వాదించటం, అదేమని ప్రశ్నించటం, వారి మాటల్లో logic వెదకటం ..ఇవన్నీ వృథా. పైగా అలా చేయటం వలన వారిని ఇంకా గందరగోళానికి గురి చేయటం, తద్వారా వాళ్ళు ఇంకా ఆవేశానికీ, ఉద్రేకానికీ లోనవుతారు. అందుకే వీలైనంత సౌమ్యత, సంయమనం, మౌనం గా ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఒక తపస్సు లాగా సేవ చేసుకుంటూ పోవడమే దారి.
వీళ్ళను చూసుకునే వ్యక్తి ముందు తను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. పేషెంట్ గురించి మాత్రమే కాదు తన గురించి తపనపడే తన ప్రియమైన మిగతా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి తనను తాను strong గా ఉంచుకోవాలి. తన ఆత్మీయుల ఆరోగ్య పరిస్థితి చూసి బాధ అనిపించినా కూడా భావావేశానికి లోనై ఒత్తిడికి లోనవకూడదు. ఎంత practical గా ఉండగలిగితే అంత మంచిది. మన భారతీయ కర్మ సిద్ధాంతానికి మించిన practical thinking ఏముంది?
Caretaker ఎవరైనా గుర్తించాల్సిన ముఖ్య విషయం తన జీవితం or life style పూర్తిగా మారిపోతుంది. అది తప్పించుకోలేమని గుర్తెరగాలి. రోజురోజుకీ మారిపోయే పేషెంట్ పరిస్థితి, వారి behavioral patterns ఊహకు అందనివి. ఏరోజుకారోజు surprises కి సిద్ధంగా ఉండక తప్పదు.
'తన చుట్టూ అందరూ లైఫ్ ఎంత enjoy చేస్తున్నారు, నా freedom కోల్పోవలసిందేనా, నాకే ఎందుకిలా..' ఇలాంటి self pity ఆలోచనలు దగ్గరికి రానివ్వ కూడదు. అలాంటి ఆలోచనల వలన stress, మానసిక దౌర్బల్యం తప్ప ఇంకేమీ రాదు.
ఉద్యోగం చేస్తున్న వారైతే రోజూ బైటికి వెళ్లి మనసు divert అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఉండేవారు తమకి నచ్చిన పనులు, ధ్యాస మళ్లేందుకు ఇష్టమైన ఏదైనా వ్యాపకం పెట్టుకుంటే కొంత ఒత్తిడి తగ్గుతుంది.
కుటుంబసభ్యులతోనూ, తోబుట్టువులతోనూ పేషెంట్ బాధ్యతనూ, emotional burden నూ తప్పనిసరిగా పంచుకోవాలి. అది సాధ్య పడకపోతే తమ బాధని empathize చేసుకోగలవారితో మాట్లాడాలి. ఒక్కోసారి
share చేసినా ప్రయోజనం ఉన్నట్టుగా అనిపించదు. అలాంటప్పుడు psychologist సహాయం తీసుకోడానికి సందేహపడక్కరలేదు. It really helps. They hear without judging and give suggestions to ease the mind and it helps to feel better and manage the situation better.
పరిస్థితి ని ఎదుర్కోక తప్పనప్పుడు అధైర్య పడకుండా, 'ఎలా ఎదుర్కోవచ్చు' అన్న దాని గురించి మాత్రమే ఆలోచించాలి.
No comments:
Post a Comment