Saturday, November 2, 2019

ఆవిడ..

ఎలాంటి పరిస్థితులోనయినా అలవోకగా ఒదిగిపోగలదు 
ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనూ  మనోనిబ్బరం, సంయమనం కోల్పోని ధీమంతురాలు
ఓర్పు, సహనం, క్షమ ఆడవాళ్ళకి బలహీనతలు కాదు..అవే వాళ్ళ బలం అని చెప్పిన మూర్తీభవించిన స్త్రీత్వం
ముఖం చూసి ఎదుటి వారి మానసికావస్థని పసిగట్టి దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకోగల మానసిక నిపుణురాలు..
స్త్రీత్వానికి నిలువుటద్దం..
ఆవిడ..
మా అత్త(గారు).
Missing you so much Atha..

2 comments:

అన్యగామి said...

బందుగుల మధ్య సంబంధాలు కుంటుపడుతున్నవేళ, అత్తగారిని పొగడటం స్మరించటం ఆదర్శనీయం. మిమ్మల్ని చూసి ఎందరో ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను.

lakshmi ramarao vedurumudi said...

ధన్యవాదాలండీ