If Daddy and I make a bundle with.. compassion, empathy, values, sensitive, kind, accommodative, flexible, responsible, understanding, adaptable, practical, analytical, sincere, honest, facing problems without fear, humourous, humble, caring, balanced mind in all circumstances..that bundle is both of you. Daddy and I feel so happy and satisfied watching you both being turned (shape up) as wonderful humanbeings. Always take care of your personality, character. Always try to improvise your personality and learn even as you are getting older. Always make your efforts but be content with what God blessed/ bestowed upon you.
We always thank God for blessing us with these two precious bundles of joy... శౌరీ, సమీర్.
Tuesday, July 23, 2019
నా వరహాల మూటలు ❤️❤️
Wednesday, July 10, 2019
స్వేచ్ఛ ప్రేమ
హేమిటో..అన్నిటితో పాటే ప్రేమకి కూడా నిర్వచనాలు మారిపోతున్నాయి ఈ మధ్య..! ప్రేమలో ఇంత స్వేచ్ఛ ఉండాలనే విషయం తెలీక అజ్ఞానం లో ఉండిపోయి ప్రేమరాహిత్యం లో బ్రతికేశాము కదా ఇన్నాళ్లూ..!
చెంపదెబ్బలు కొట్టే / తినే ఎన్నెన్ని ఛాన్సులు మిస్ అయామో కదా..ఛ..!
ఇకనైనా కళ్ళు తెరిచి బాకీలతో సహా మన ప్రేమని నిరూపించుకునే ప్రయత్నం చేద్దాం!!
Caution: 'నువ్వు కొట్టినా నేను కుక్కిన పేనులా కిక్కురుమనకుండా ఉంటానెలాగూ.. అలా 'కొట్టే ప్రేమ' నీకు నామీద పిచ్చి పిచ్చిగా ఉందని తెలుసు ..కాబట్టి నువ్వు నిరూపించుకోవాల్సిన పనిలేదు. నాకు నిన్ను స్వేచ్ఛగా కొట్టగలిగేంత ప్రేమ ఉందని నేనే నిరూపించుకోవాలి.' అని చెప్పటం మాత్రం మరచిపోకుండా 'పని' కానిచ్చేయటమే😋!
Friday, July 5, 2019
నమో వెంకటేశాయ!!
"నీలోని అహంకారాన్ని, మోహాన్ని 'నెట్టిపడేయ్' "
-తిరుపతి వెంకన్న తన భద్రతా సిబ్బంది ద్వారా 'సామాన్య' భక్తులకు ఇచ్చే సందేశం.
🙏నమో వెంకటేశాయ!
*****
చాలా చిన్నతనం లో స్వామి తీర్థము, శఠగోపం తీసుకోటం ఛాయామాత్రంగా గుర్తుంది..
పెద్దవుతున్న కొద్దీ తిరుపతి వెళ్లిన ప్రతిసారీ ఎదురయిన రకరకాల అనుభవాలు, అనుభూతులూ, జ్ఞాపకాల తో పాటూ కొండపైన క్రమంగా వచ్చిన , ఇంకా వస్తూనే ఉన్న పెను మార్పులను చూస్తూవుంటే చాలా ఆశ్చర్యం గా ఉంటుంది.
పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, మైకుల్లో సన్నగా వినిపించే స్వామివారి అర్చనలు, మంగళంపల్లి, సుబ్బలక్ష్మి మొదలయిన వారి గాత్రం, వాయిద్యాలు వింటూ ప్రశాంతంగా కొండ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే..ఆహా..ఆ అనుభూతిని వర్ణించగలమా!
అంతంతసేపు క్యూ లో ఉన్నా స్వామివారిని 'ప్రశాంతంగా', దగ్గరగా దర్శించుకునేది కొన్ని నిమిషాలు మాత్రమే అయినా ఎంతో తృప్తిగా అనిపించేది.
(నిమిషాలు క్షణాలుగా.. ..క్షణంగా, దర్శనం 'మహా లఘు దర్శనం' గా మారింది. 'అది మహా లఘు దర్శనం కాదండీ..''మహాలాగు'' (pull)దర్శనం' అని TTD officer ఒకాయన జోక్ గా అన్నారు.)
దర్శనం అయిన తర్వాత మహాద్వారం ఎదురుగా ఉన్న మెట్ల వరుసలో కూర్చుని ఏదో తన్మయత్వంలో సేద తీరటం, ఆ తర్వాత అలా వెళ్లి ఇరువైపులా ఉన్న కొట్లు చూసుకుంటూ నడవటం, మధ్య మధ్య ఆగి ఏమయినా కొనుక్కోటం..అవన్నీ దివ్యమైన యాత్రానుభవాలు!!
80ల్లో అనుకుంటా woodlands హోటల్ అని పెట్టారు. ఆ హోటల్ లో పూరీ కూర, పొంగల్..వాటి రుచి ఇప్పటికీ నోట్లోనే ఉంది. ఆ పక్కనే కొంచెం ముందుకి వెళ్తే పెద్ద తోట..రకరకాల పువ్వులతో రమణీయంగా ఉండేది. అసలు కొండ అంతా సంపంగి సువాసనతో ఆహ్లాదంగా ఉండేది. ఆ గార్డెన్ దగ్గరే అనుకుంటా రాతి మంటపం ఉండేది. ఆ చివర ఒక వ్యూ పాయింట్ . అక్కడ నుంచీ చూస్తే పాత కాలిబాట (ఇప్పుడు శ్రీవారి మెట్లు ట) కనిపిస్తూ ఉండేది. ఇప్పుడక్కడ అలాంటివేమీ లేవు అని ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు డ్రైవర్ చెప్పాడు.
1991 లో వెళ్ళినప్పుడు తోమాలసేవ, అర్చన (ముందురోజు విజయా బాంక్ లో సేవల కోసం టికెట్లు కొనుక్కోటమే..సో సింపుల్) అయినతర్వాత హుండీ ఎదురుగా ఉన్న మంటపం మెట్ల మీద కూర్చుని ఉన్నాము. ఒక పూజారిగారు తమలపాకులో స్వామివారి నవనీత ప్రసాదం మా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అది స్వామివారి చల్లటి దీవెనే కదా!!
అంగప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ సుప్రభాత సేవ అయేవరకూ క్యూ లో వేచివుండాలి. ఆ బ్రహ్మ ముహూర్తపు ఘడియలలో, ఆహ్లాదకరమైన ప్రకృతిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎదురుగా అంతెత్తున ధ్వజ స్థంబపు చిరుగంటలు చేసే సవ్వడి తప్ప ఇంకేమీ శబ్దం లేకుండా..ఆహా..దేముడు ఆ గంటల చిరు సవ్వడి లోనే ఉన్నాడా అన్నట్టుగా..అనుభవిస్తే తప్ప తెలియని అద్భుతమైన భావం!!
ఎన్ని సార్లు చూసినా, అల్లంత దూరం నుంచీ చూసినా, లిప్తపాటు దర్శనమయినా ఆత్మానందాన్ని కలిగించే ఆ దివ్య మంగళరూపం..!!