Friday, February 8, 2019

The Vacation

When you are lost in days and dates..Not thinking about past..Not worrying about future..You actually living in the present..Enjoying the world around you... Absolute bliss..
17 days of total bliss!

తర్జనభర్జనలు, వాదోపవాదాలు, గూగుల్ రి-సెర్చ్ లూ ..అన్నీ అయినతర్వాత మొత్తానికి కొంచం వైవిధ్యమైన, 17 రోజుల పర్యటనకి ప్రణాళిక రూపొందింది. పది సంవత్సరాల తర్వాత వెళ్తున్న టూర్ కాబట్టి ఉత్సాహం సహజం కదా..షాపింగ్ లు..సద్దుకోటాలూ..మామూలే.

8-12-2018:
కొడగు (కూర్గ్), కర్ణాటక

హైదరాబాద్ లో పొద్దున్న 8 ఫ్లైట్ లో బెంగుళూరు..అక్కడి నుంచీ కొడగు కి రోడ్ మీద ప్రయాణం. మధ్యదారిలో తుంకూర్, కామత్ హోటల్ లో వేడి వేడి జొన్నరొట్టెల భోజనం చాలా బాగుంది. ఊహించుకున్నట్టుగా దారిలో సీనిక్ బ్యూటీ ఏమీ లేదు. కూర్గ్ కి 10 km లో బాగుంటుందని డ్రైవర్ చెప్పాడు. కానీ అప్పటికి చీకటి పడిపోయింది.

దారిలో Buddhist Monastery Golden temple చూశాము.


   
 




కూర్గ్ చేరేసరికి 8 అయింది. ఇక్కడ హోంస్టే బుక్ చేశాము. ఉండటానికి బానే ఉంది..కానీ మడికెరీ టౌన్ మధ్యలో ఉండటంతో అసలు వ్యూ ఏమీ లేదు.

9-12-2018
(భగమండలేశ్వరస్వామి గుడి, తల కావేరి, కాఫీ/స్పైసెస్ ప్లాంటేషన్స్)

కొడగు.. ఊహించుకున్నట్టుగా చలి ఏమీ లేదు.. హైద్రాబాద్ లాగానే ఉంది. పగలు ఎండ, రాత్రికి కొంచం చల్లగా ఉంది. ఎందుకో అరకు గుర్తొచ్చింది. అరకుది అమాయకపు అడవికన్య అందమయితే కొడగు యూరోపియన్ ఛాయలున్న సోఫిష్టికేటెడ్ లేడీ లా అనిపించింది.

మడికెరి అభివృద్ధి చెందిన పట్టణం. తొంభై శాతం మందికి కాఫీ ఏస్టేట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కాఫీ ప్లాంటేషన్స్ ఓనర్స్ ఉన్నారని తెలిసింది. కొడవ కమ్యూనిటీ పూర్వీకులు ఇరాక్ మూలాలు ఉన్నాయట. తర్వాత హిందూయిజం లోకి మారినట్టుగా కొడవ జాతికి చెందిన ఒకాయన చెప్పారు. వీళ్ళలో విగ్రహారాధన ఉండదు. వారి పూర్వీకులని, ప్రకృతిని, కావేరి నదిని ఆరాధిస్తారు. చదువుకు ప్రాధాన్యతని ఇస్తారు. తమ సంస్కృతి, సంప్రదాయానికి చాలా విలువ, గౌరవం ఇస్తారు. గొప్పగా భావిస్తారు.



Kaveri, Goddess of Kodava community.


భగమండల:
భగమండల ముని తపస్సు చేసి, ప్రతిష్టించిన శివుడి గుడి. కేరళ నిర్మాణశైలి లో పెద్ద ప్రాకారంతో పరిశుభ్రంగా ఉంది. గుడి సమీపం లో కావేరి, ఉపనదుల త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ కొంతమంది పితృదేవతలకు తర్పణాలు ఇస్తున్నారు.



తల కావేరి:

కావేరీ నది జన్మ స్థలం. కొడవల ఆరాధ్యదేవత. వాళ్లే పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఎందుకో నాకు మహాబలేశ్వర్ దీనికంటే నచ్చింది..ఇంత development లేకపోయినా..serene గా ఉంటుంది.



కాఫీ ప్లాంటేషన్స్:
మిరియాలు, మసాలా ఆకు, దాల్చిన చెట్లు, వెనీలా, కొన్ని పండ్ల చెట్లు.


           



10-12-2018
దుబారే ఎలిఫెంట్ కాంప్, అబ్బి ఫాల్స్, షాపింగ్.

కొడగు ట్రిప్ లో బాగా నచ్చింది ఇదొక్కటే. దుబారే ఎలిఫెంట్ కాంప్. కావేరీ నది అవతలి ఒడ్డుకి మోటార్ బోట్ లో పది నిమిషాల లోపుగా వెళ్ళచ్చు. మావటివాళ్ళు ప్రతిరోజూ ఏనుగులని అడవిలో తిప్పి పొద్దున్న 9 కి నది దగ్గరికి స్నానానికి తీసుకువస్తారు. కొంత ఫీస్ కట్టి వాటికి మనం స్నానం చేయించడం, తినిపించటం చేయవచ్చు. ప్రస్తుతం 29 ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ rafting కూడా చేయచ్చు.




అబ్బిఫాల్స్:

అబ్బే..నీటి దగ్గరకి వెళ్ళటానికి లేదు. అసలు అవి సహజమైన జలపాతం,మంచి నీళ్లేనా అని doubt వచ్చింది. జలపాతం చూడటానికి 150 మెట్లు దిగాలి...మళ్లీ అన్ని మెట్లూ ఎక్కాల్సిందేగా!



Personal opinion: కొడగు కంటే అరకు చాలా బాగుంటుంది.


11-12-2018
జైపూర్, రాజస్థాన్.

కూర్గ్ నుంచీ పొద్దున్న 8కి బయలుదేరి బెంగళూర్ వచ్చి అక్కడినుంచీ జైపూర్ చేరేసరికి సాయంత్రం 7 అయింది. ప్రశాంతమయిన శాస్త్రీయసంగీత సభ నుంచీ ఒక్కసారిగా డిస్కోథెక్ లోకి వచ్చి పడ్డట్టుగా అనిపించింది. Vibrant and colorful రాజస్థాన్!! Jaipur..The pink city!!

12-12-2018
సిటీ పాలస్, జంతర్ మంతర్, చౌకి ధని

జైపూర్..పాత కొత్తల కలబోతతో కళకళలాడుతూ ఉంటుంది. ఠీవిగా రాజప్రాసాదాలూ ఉంటాయి, ఆధునాతనమైన భవంతులూ ఉంటాయి..మెట్రో రైలు తో సహా..

రోడ్లు చాలావరకూ విశాలంగా, శుభ్రంగా ఉంటాయి. అక్కడక్కడా చండీగఢ్ గుర్తొచ్చింది. తప్పకుండా చూడాల్సిన నగరం.










సిటీ పాలస్: సవాయి మాన్ సింగ్ 2 చేత కట్టబడిందిట. కోట లో కొద్ధి భాగం మ్యూజియం గా మార్చారు. మిగిలిన కోట లో ప్రస్తుత రాజవంశీయులు నివసిస్తున్నారు. మ్యూజియం లో పూర్వపు రాజులకు, కోటలకు, గుడులకు చెందిన ఆనవాళ్లు..శిల్పాలు(దేశంలో చాలా ఆలయాలలో కనిపించినట్టుగానే తురుష్కుల చేత ముఖాలు, చేతులు,అవయవాలు ధ్వoసం చేయబడిన శిల్పాలు), చాలావరకు కత్తులు, తుపాకులు, వర్ణ చిత్రాలు, బొమ్మలు, దుస్తులు, ఆభరణాలు, వాయిద్యాలు, శాసనాలు, ..ఉన్నాయి.


   





జంతర్ మంతర్: సిటీ పాలస్ పక్కనే ఉంటుంది. ఇది కూడా మహారాజా మాన్ సింగ్ 2 గారి చే కట్టబడింది. ఆయనకు స్వయంగా జ్యోతిష్య శాస్త్రం తెలుసుట. ఆ ఆసక్తి తో అతిపెద్ద గ్రహ గణన యంత్రాలు 19 ని నిర్మించారుట. ప్రస్తుతం ఉన్నది పునర్నిర్మించినది. అ క్షాoశాలూ, రేఖాoశాలూ, గ్రహాల స్థితిగతులు, సమయం..మొదలయినవన్నీ తెలియచెప్పే విజ్ఞానశాస్త్ర సంబంధమయిన 19కట్టడాలతో అద్భుతంగా ఉంటుంది. . దీని గురించి బాగా వివరించగల గైడ్ ని పెట్టుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.


    



చౌకి ధని:
రాజస్థాన్ గ్రామీణ జీవిత నమూనా. హైదరాబాద్ లో డోలరేధని చూస్తే ఇది చూడక్కరలేదు. ఆసలైన రాజస్థానీ భోజనం రుచి చూడాలంటే మాత్రం తప్పక వెళ్ళాలి. వేడి వేడిగా కొసరి కొసరి వడ్డిస్తారు..ఇంతింత నెయ్యి, వెన్నముద్దలతో సహా.







13-12-2018
ఆమెర్ ఫోర్ట్, హవా మహల్, కొంచం షాపింగ్.

ఆమెర్ ఫోర్ట్..అల్లంత దూరాన్నుంచే రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తుంది. జోధాబాయ్ పుట్టినచోటు. కోటపైకి వెళ్ళటానికి ఏనుగుల మీద కూడా వెళ్ళచ్చు. అద్భుతమైన, అందమైన, దుర్భేద్యమైన కట్టడం. కోట గురించి చెప్పటానికి గైడ్ లు ఉంటారు. కానీ వాళ్ళు అన్నీ చూపించరు. ఏవో కొన్ని ముఖ్యమైనవి మాత్రం చూపిస్తారు. కోట సౌందర్యం సంపూర్ణంగా ఆస్వాదించాలంటే సావకాశంగా చూడాలి. జోధా అక్బర్ సినిమాలో కొన్ని సీన్స్ ఇక్కడ తీశారు.



     




హవా మహల్:
మహారాజా ప్రతాప్ సింగ్ చే కట్టబడింది. రాజపుత్ర స్త్రీలు ఈ భవనం నుంచి వీధిలో జరిగే కార్యక్రమాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు చూసేందుకు వీలుగా చిన్న చిన్న కిటికీలతో, చల్లటిగాలి రావటానికి వీలుగా నిర్మించబడింది. హవామహల్ ఎదుటి నుంచీ చూస్తే ఎంత అందంగా ఉంటుందో వెనకాల నుంచీ చూస్తేకూడా అంతే అందంగా, అద్భుతమైన పనితనంతో ఉంటుంది. వెనక వైపు వెళ్ళటానికి మహల్ పక్కనుంచి దారి ఉంది. ఇక్కడి నుంచి చూస్తే జంతర్ మంతర్, సిటీ పాలస్, దూరంగా ఆమెర్ కోట కనువిందు చేస్తాయి.










కోటల అందాల వెనుక శ్రమ అందం.


జల్ మహల్:
సరస్సు మధ్యలో నిర్మించబడిన ముచ్చటయిన కట్టడం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వెళ్ళనివ్వటం లేదు. దూరం నుంచి చూడటమే.




షాపింగ్:
జైపూర్ వెళ్ళినప్పుడు చెయ్యాల్సిన ముఖ్యమయిన పని షాపింగ్. బాపు బజార్, Johri బజార్ తప్పకుండా చూడాలి. అసలయిన నగలతో పాటూ ఆర్టిఫిసియల్ జ్యువలరీ కి కూడా ఇక్కడ Johri బజార్ కి మంచి పేరు.

కూర్గ్ వెళ్లకుండా రాజస్థాన్ లొనే ఆ 3 రోజులు ఉండి ఉంటే ఉదయపూర్, జోధ్ పూర్, చిత్తోఢ్ గడ్ చూసి ఉండే వాళ్ళం కదా అనిపించింది. Mesmerizing Rajasthan!





14-12-2018
గ్యాంగ్ టాక్, సిక్కిం.

పొద్దున్న జైపూర్ లో బయలుదేరి ఢిల్లీ మీదుగా బాగ్ డోగ్రా(వెస్ట్ బెంగాల్, మిలిటరీ ఎయిర్ పోర్ట్) చేరేసరికి సాయంత్రం 5 అయింది. కానీ అక్కడ 7 అయినట్టుగా చీకటి పడిపోయింది. అక్కడినుంచి రోడ్ మీదుగా గాంగ్ టాక్ బయలుదేరాం. Outskirts దాటేవరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంది. గ్యాంగ్ టాక్ చేరేసరికి రాత్రి 11 అయింది. కార్ లో తెలీలేదు కానీ., దిగంగానే ఒక్కసారి 5 డిగ్రీల చలికి ఒణుకు వచ్చేసింది.

15-12-2018
బాబా హర్ భజన్ సింగ్ జీ కా మందిర్, చాంగు లేక్ (Tsomgo).

https://en.wikipedia.org/wiki/Baba_Harbhajan_Singh :

13000 అడుగుల ఎత్తులో, భారత సైన్యానికి చెందిన సైనికుడు హర్ భజన్ సింగ్ స్మృత్యర్ధం నిర్మించబడిన మందిరం. ఆర్మీ సంరక్షణలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళటానికి ముందుగా సిక్కిం పోలీస్ పర్మిట్ తీసుకోవాలి. సైనికులతో కలిసి జాతీయగీతం పాడుతూ జండా వందనం చేయటం ఉత్తేజంగా, సంతోషంగా అనిపించింది. గడ్డకట్టుకుపోయే చలిలో మాతృదేశాన్ని రక్షిస్తూ, సేవలందించే భారత సైన్యానికి వందనం..salute.




Baba Harbhajan singh ka mandir





Tsomgo లేక్:
డిసెంబర్ నెల కావటం తో చుట్టూ మంచు పర్వతాలు..సగం సరస్సు గడ్డ కట్టుకు పోయి సగం నీరు, సగం మంచు తో కన్నుల పండుగ గా అనిపించింది. అక్కడ సరదాగా కొంచంసేపు మంచులో ఆడుకోవచ్చు.

దాదాపు ఈశాన్య భారతం అంతా కూడా సైట్ సీయింగ్ సాయంత్రం 4/5 వరకే..తర్వాత చీకటి పడిపోతుంది.









Tsomgo Lake


Observations and disappointments:
సిక్కిం ప్రకృతి సౌందర్యం ఎంత బాగుంటుందో రోడ్లు అంత అధ్వాన్నంగా ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. అసలే ఘాట్..ఇంక రోడ్లు కూడా ఇలా ఉండటంతో ప్రయాణం సౌకర్యంగా అనిపించదు. దానికితోడు డ్రైవర్లు తలబిరుసుతో ఉంటారు.

నాథులపాస్ వెళ్లకపోవటం చాలా disappointing. అక్కడికి వెళ్ళటానికి ఒకరోజు ముందే permission తీసుకోవాలిట.

16-12-2018
Do-drul chorten Monastery, బన్ జాఖ్రి వాటర్ ఫాల్స్, Sikkim hand looms and handicrafts.

ముందు అనుకున్నదాని ప్రకారం ఈరోజు లాచుంగ్ బయలుదేరాలి. కానీ నిన్నటి ప్రయాణం, వాతావరణం వలన చిన్న ఆరోగ్య సమస్య రావటం తో లాచుంగ్ ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆ రెండు రోజులూ కూడా గాంగ్ టాక్ లోనే ఉందామని అనుకున్నాము. కొంచం నిరుత్సాహంగా అనిపించినప్పటికీ break within the break అనుకున్నాము. తీరికగా గాంగ్ టాక్ అందాలు చూడచ్చు కదా!



బన్ జాఖ్రి ఫాల్స్: చిన్న, ముచ్చటైన, సురక్షితమైన జలపాతం. నీళ్లలో దిగటానికి కూడా అనువుగా, ఎక్కువ లోతు లేకుండా ఉంటుంది. ఇక్కడ చిన్న పార్క్ develop చేశారు.





Do-Drul Chorten Monastery:
ప్రశాంతమైన బౌద్ధ స్థూపం. ఒకతను బైట కూర్చుని ఒక వాయిద్యాన్ని ఎంతో ప్రతిభతో వాయిస్తూ పాడుతున్నాడు. ఆ వాయిద్యం నేపాలీ సారంగి అని చెప్పాడు. తన తాతగారు తనకి బహుమతిగా ఇచ్చినట్టు చెప్పాడు.


Do Drul Chorten Monastery


Sikkim hand looms and handicrafts:
సిక్కిం ప్రభుత్వం వారి చేతివృత్తుల సంస్థ. సిక్కిం కార్పెట్స్, సిక్కిం కళాకారులు తయారు చేసిన కళాకృతులు, వస్తువులు, తినే పదార్ధాలు ప్రదర్శన. కొనుక్కోవచ్చుకూడా.


Carpet weaving, Sikkim.


17-12-2018
తషి వ్యూ పాయింట్ ,గణేష్ టోక్, హనుమాన్ టోక్, రోప్ వే, MG మార్కెట్.

త షి వ్యూ పాయింట్:
ఇక్కడి నుంచి హిమాలయా ఉన్నత శిఖరాలలోఒకటైన కాంచన్ జంగా ను చూడచ్చు. సూర్యోదయం సమయానికి ముందే అక్కడికి చేరుకుంటే సూర్యుడి మొదటి కిరణాలు పడి పసిడి రంగులో మెరిసిపోయే కాంచన్ జంగా మంచుపర్వత శ్రేణి కనువిందు చేస్తుంది. అసలు గ్యాంగ్ టాక్ లో చాలా చోట్ల నుంచీ కూడా కాంచన్ జంగా శిఖరం కనిపిస్తూ ఉంటుంది.





గణేష్ టోక్:
కొంచం ఎత్తయిన ప్రదేశం లో కట్టబడిన వినాయకుడి గుడి. ఇక్కడి నుంచి కాంచన్ జంగా ఇంకా దగ్గరగా కనిపిస్తుంది.



View from Ganesh tok


హనుమాన్ టోక్:
హనుమాన్ టోక్ కొంచం ఎత్తులో ఉంటుంది. వెళ్ళేదారి కూడా చుట్టూ చెట్లతో అందంగా ఉంటుంది. ఈ గుడి భారత సైన్యం తో నిర్వహించబడుతూ ఎంతో శుభ్రతతో, ప్రశాంతంగా ఉంటుంది. గాంగ్ టాక్ నుంచీ కాంచన్ జంగా ని చూడటానికి అన్నిటిలోకీ ఇది బెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచీ సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా అద్భుతంగా కనిపిస్తుందేమో అనిపించింది.


View from Hanuman tok

రోప్ వే:
గ్యాంగ్టాక్ పట్టణం, దూరంగా వెండి కొండలు చూడచ్చు.

MG మార్గ్:
ఈ రోడ్ లో వాహనాలు తిరగవు కాబట్టి హాయిగా నడుస్తూ షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడే ఉన్న బెంచీలపై కూర్చుని ఉత్తినే కాలక్షేపం కూడా చేయచ్చు.



Personal opinion: సిక్కిం ట్రిప్ 4, 5 రోజులు ప్లాన్ చేసుకుంటే గ్యాంగ్ టాక్ లో ఒక రోజులో నాథుల, బాబాజీ మందిర్, లేక్ పూర్తి చేసుకుని మిగతా రోజులు లాచుంగ్, పెలింగ్ చూస్తే బాగుంటుంది.


Sikkim's spiciest Dalle mirchi

18-12-2018
గ్యాంగ్ టాక్ నుంచీ సిలిగురి: (వెస్ట్ బెంగాల్)





Teesta river

గ్యాంగ్ టాక్ లో పొద్దున్న తీరికగా 11 కి బయలుదేరి సిలిగురి కి ప్రయాణం. అద్భుతమైన, అందమైన కొండ దారిలో ఒంపులతో వయ్యారంగా మెలికలు తిరుగుతూ ఆకుపచ్చటి తీస్తా నది దారి పక్కనే ప్రవహిస్తూ, పరుగులు పెడుతూ మనతోనే వస్తున్నట్టుగా ఉంటుంది..సిలిగురి వరకు. సిలిగురిలో ఆ రాత్రికి బస.

19-12-2018
గౌహతి, షిల్లాంగ్. (అస్సాం, మేఘాలయ)

పొద్దున్న బాగ్ డోగ్రా లో బయలుదేరి గౌహతికి ప్రయాణం. నిన్న భూమాత ఆకుపచ్చటి చీరలో ఆకట్టుకుంటే ఈరోజు స్వచ్ఛమైన ధవళవస్త్రం లో మెరిసిపోతూ మురిపించింది. బాగ్ డోగ్రా నుంచీ గౌహతి వరకు విమానం లో హిమాలయ వెండి శిఖరాలు వెన్నంటివచ్చి కన్నులపండుగ చేశాయి.


View from Aeroplane (on the way to Bagdogra to Guwahati)


గౌహతి లో బ్రహ్మపుత్రా నదిలో నీళ్లు చిలకరించుకుని, శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్యా దేవిని దర్శించుకుని షిల్లాంగ్ చేరేసరికి రాత్రి 8 అయింది.




River Brahmaputra


Kamakhya temple


20-12-2018
Natural root bridge, Mawlynnong, Dawki.

షిల్లాంగ్..అందమైన, హుషారైన నగరం. క్రిస్మస్ రోజులు అవటం తో నగరమంతా విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోతోంది.

Living root bridge:
చిన్న నీటి ప్రవాహం మీదుగా రబ్బర్ చెట్ల వేళ్ళతో ఒక వంతెనని తయారు చేశారు. వంతెన మీదుగా అవతలి వైపుకి నడుచుకుంటూ వెళ్ళచ్చు..ఒకసారి ఒకళ్ళు మాత్రమే నడవాలి.

కింద చిన్న కొలను తో అందమైన టూరిస్ట్ స్పాట్. లివింగ్ రూట్ బ్రిడ్జ్ చూడాలంటే చాలా మెట్లు దిగాలి..మళ్లీ ఎక్కాలి.




Living root bridge

Mawlynnong: (cleanest village in Asia/India)
ఇక్కడ ఎక్కువగా కాషీ తెగకు చెందిన వారు ఉంటారు. చాలావరకు క్రై స్తవులు ఉండటం వలన 3 చర్చ్ లు ఉన్నాయి కానీ ఒక్క గుడీ లేకపోటం లో ఆశ్చర్యం లేదు.

Personal opinion: not an interesting place. టూరిజం కోసం 'తయారు చేయబడిన' (commercialized) గ్రామం అనిపించింది.




Asia's cleanest village, Mawlynnong.

Umngot (Dawki) river:
ఇక్కడికి వెళ్లే దారి అంతా పోక చెట్లు, తమలపాకు తోటలు, తేజ్ పత్తా(మసాలా ఆకు)ఇలా రకరకాల చెట్ల తో చాలా బాగుంటుంది.


Betel nut


Umngot భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రవహించే నది. నది అట్టడుగున ఉన్న రాళ్లు, మట్టి కూడా స్పష్టo గా కనిపించేంత స్వచ్చంగా ఉంటుంది నీరు. పడవలో షికారు చేయచ్చు. బాగా ఎండ ఉన్న టైం లో వెళితే , గూగుల్ లో చూసే 'magical photos' (నీళ్లలో పడవ తేలుతున్నట్టుగా కనిపించే ఫోటోలు) తీసుకోవచ్చేమో! రోడ్ నుంచి నది ఒడ్డుకి దిగటానికి సరిఅయిన మెట్లు/దారి లేదు. కాళ్ళ నొప్పుల వాళ్ళకి కష్టమే.





Umngot river, Dawki.


21-12-2018
Air force museum, Elephant falls, Shillong,
Kazi ranga (Assam)

Air Force Museum:
షిల్లాంగ్ లో తప్పకుండా చూడాల్సినది. యుద్ధ విమానాలు, వాటి నమూనాలు, మన దేశం సాధించిన విజయాలకు సంబంధించిన చరిత్ర, ఫోటోలు, ఎయిర్ ఫోర్స్ కి సేవలందించిన ఉన్నతాధికారులు, వారు సాధించిన మెడల్స్, దుస్తులు, రాకెట్స్, హెలికాప్టర్స్, ఇలా ..అవన్నీ చూస్తుంటే ఏదో ఉద్వేగంగా, ఉత్తేజంగా, గర్వంగా అనిపిస్తుంది.






Air force museum


ఎలిఫెంట్ ఫాల్స్:
మూడు లెవెల్స్ లో ఏర్పడిన జలపాతం. అన్ని లెవెల్స్ చూడాలంటే మెట్లు దిగాలి.

కజిరంగా చేరేసరికి రాత్రి 8 అయింది.




22-12-2018
కజిరంగా నేషనల్ పార్క్.

ప్రపంచంలో ఉన్న రైనో సార్ల సంఖ్యలో మూడు వంతులు ఇక్కడే ఉన్నాయట. ఇంకా పులులు, ఏనుగులు, జింకలు, రకరకాల పక్షులు వన్య ప్రాణులకు నెలవు. ఏనుగు సఫారీ, జీప్ సఫారీలలో అడవి లోకి వెళ్ళచ్చు. కానీ 20 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే తీసుకు వెళ్తారు. మంచి కెమెరా, binoculars తీసుకు వెళ్తే బాగుంటుంది. అదృష్టం ఉంటే జంతువులు కనిపిస్తాయి. లేదంటే అడవి లో షికారు చేసి రావటమే. దారి పొడుగునా రైనో ల 'potty' మాత్రం కనిపిస్తూనే ఉంటుంది.






23-12-2018
Kaziranga to Jorhat

తిరుగుప్రయాణం జోరహాట్ నుంచీ కావటం తో కజిరంగా నుంచీ జోరహాట్ కి వెళ్తూ మధ్యలో Bokakhat లో ఒకసారి ఆగి మార్కెట్ లో అస్సామ్ లో దొరికే కూరలు, పళ్ళూ సరదాగా చూసి, కొన్ని కొని, సాయంత్రానికి జోరహాట్ చేరాము. జోరహాట్ లో అస్సామీ సంప్రదాయానికి చెందిన ఇత్తడి, కంచు పాత్రల షాపులు చాలా ఉన్నాయి.


Bhut Jolokia mirchi


Lemon


Xorai, Assamese traditional brassware


24-12-2018 (last day of the tour)
Jorhat to Hyderabad via Kolkata.


జోరహాట్ నుంచి మాజులి ఐలాండ్ చాలా దగ్గర అని తర్వాత తెలిసింది. మిస్ అయ్యాము. కోల్కతా లో వేచి ఉండే టైం ఎక్కువగా ఉండటం తో అక్కడ ఉన్న Biswa Bangla shop లో curtains..(కింద కూర్చునే చాపలకు వాడే పుల్లలతో చేసినవి)చూశాము. హైద్రాబాద్ లో పంజాగుట్టలో సెంట్రల్ లో వాళ్ళ స్టాల్ లో కూడా అవి దొరుకుతాయిట.

మొత్తానికి దేముడి దయతో 17 రోజుల trip ముగించుకుని క్షేమంగా హైద్రాబాద్ చేరుకున్నాము.

_ _ _ _ _


గమనించిన విషయం: మొత్తం వెళ్లిన ఇన్ని ప్రదేశాలలో చిన్న, పెద్ద ఎలాంటి రెస్టారెంట్లు అయినా హైద్రాబాద్ తో పోలిస్తే రేట్లు చవకగా ఉన్నాయి. నాణ్యత కూడా హైదరాబాద్ కంటే బాగుంది. హైద్రాబాద్ లో హోటల్స్ జనాన్ని దోచుకుంటున్నాయి.

Lessons learned: don't blindly rely on drivers (most of them always discourage you to explore)/travel agents itinerary. Try to explore less seen places. For that you can ask hotel people and of course google is always there anyway.



#coxandkings Our travel agent. They customized our trip covering 3 sectors...I.e., South, North & East. #makemytrip said they do not undertake trips covering multiple sectors. #southerntravels quoted exorbitant rates.



#coxandkings Hyderabad representative Venkatrami Reddy did an excellent job. Their arrangements are really good & flexible. But they too missed out on a few issues. For example, they did not include Elephant Safari in Coorg. They also did not arrange for Nathula Pass in Gangtok. We came to know only in the last minute. Overall, Cox & Kings are good.

3 comments:

విన్నకోట నరసింహా రావు said...

ఫొటోలు ఓపెన్ అవడం లేదు. అయినప్పటికీ మీ travelogue లోని వర్ణనలే ఆసక్తికరంగా ఉన్నాయి. నచ్చిన వాటితో బాటు నచ్చకపోతే నచ్చని వాటి గురించి కూడా చెప్పడం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ... బాగుంటుందనుకున్న కొడగు గురించి నిరుత్సాహపరిచింది. మొత్తానికి ఓపికగా భారతదర్శనం చేశారన్నమాట.

కోనసీమ కోబ్రాస్ లాగానే కొడగు కోబ్రాస్ అన్నారు మీరు. కో(నసీమ) బ్రా(హ్మణుల) తెలివితేటలు, చాకచక్యం, లౌక్యం గురించి సూచించడానికి అలా అంటుంటారు. మరి కొడగు వారు కూడా అంతేనా?

lakshmi ramarao vedurumudi said...

అయ్యో..నాకు కోబ్రాస్ అంటే ఈ అర్థంలో వాడతారని తెలీదండీ..కలిగినవాళ్ళు (wealthy people)ని అలా అంటారనుకున్నాను. అసలు అర్ధం తెలియచేసినందుకు ధన్యవాదాలు.

lakshmi ramarao vedurumudi said...
This comment has been removed by the author.