సామాన్యం....అయినా సంక్లిష్టం
నీకు అందంగా కనపడాలి అనుకుంటాను తయారవ్వటానికి అద్దం ముందుకొస్తాను అద్దంలో నన్ను నేను చూసుకుంటాను ప్రత్యేకంగా అలంకరించుకునే అవసరం కనిపించదు..అదేమిటో.. నీ తలపులే నా అలంకారాలు...కదా మరి!!
మన మనసులు అద్వైతం మన బంధం అద్వితీయం.
నీ ఊసులే నా ప్రేరణ నీ ఊపిరే నా ప్రాణాధారం
మమతను పంచే నీ చెంత చింతలేదు నా జీవితమంతా
మకరంద మొలికే నీ హృదయానికికదంబ మాలనై అల్లుకుపోనీ
ఎప్పటికీ..