వసంత కోయిల పంచమ స్వరంలా వినిపించే జ్ఞాపకాలు
గ్రీష్మం లా మండే జ్ఞాపకాలు
మనసును తడిపే చిరుజల్లుల జ్ఞాపకాలు
శరత్ వెన్నెల లా తెల్లని, చల్లని జ్ఞాపకాలు
హేమంతపు చలిలో వెచ్చటి దుప్పటిలా
హత్తుకునే జ్ఞాపకాలు
చిగురించే ఆశలకు చోటిస్తూ
జ్ఞాపకాలుగా మారి ..రాలిపోయే అనుభవాలు.