ఆరోజు మా పెద్దబాబు పుట్టిన 7వ రోజు. మర్నాడు నాకు కుట్లు విప్పి ఇంటికి పంపిస్తారు. ఏడో రోజు పొద్దుటి నుంచీ నాకు జ్వరం, సాయంత్రానికి ఒంటిమీద అక్కడక్కడా బొబ్బల్లాంటి పొక్కులు కనిపించాయి. డాక్టర్ గారు రౌండ్స్ కి వచ్చినప్పుడు చూసి 'chicken pox,(ఆటలమ్మ/పొంగు) ఇక్కడ హాస్పిటల్ లో ఉండకూడదు, ఈ రూమ్ వెంటనే sterilize చెయ్యాలి, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను' అని అప్పటికప్పుడు కుట్లు విప్పేశారు. నిమిషాల మీద ఖాళీ చేయించారు.
నన్ను బాబు దగ్గర ఇంట్లో ఉంచద్దు, ఇంకెక్కడైనా పెట్టమన్నారు. నన్ను ఉంచటానికి హైదరాబాద్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ కీ ఫోన్ చేశారు. అడ్మిట్ చేస్కోటానికి ఏ హాస్పిటల్ కూడా ఒప్పుకోలేదు. చివరికి Barkatpura, woodlands హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకున్నారు, రూమ్ కి ఎక్కువ కడతాము అని ఒప్పందం మీద.
బాబు మా వాళ్ళింటికి, నేను హాస్పిటల్ కి. రోజూ అమ్మ వచ్చి సాంబ్రాణి పొగ వేసేది. పక్క మీదకి వేపాకులు. 12 రోజులు అక్కడే ఉన్నాను. ఇంతాచేసి బాబుకి కూడా వచ్చిందిట. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు. కాకపోతే చాలా తక్కువగా..అక్కడక్కడా. వయసును బట్టి దాని తీవ్రత పెరుగుతుందని చెప్పారు. నాకు తగ్గి ఇంటికి వచ్చాను..నా husband కి వచ్చేసింది.
ఇంతకీ నా సందేహం ఏమంటే మన పల్లెటూళ్ళు, చిన్న చిన్న ఊర్లల్లో ఆటలమ్మ అంటే ఇంత హంగామా చేస్తారా అసలు? స్కూల్ మానిపిస్తారు, ఇంట్లోనే ..అంతగా అయితే వేరేగా ఉంచుతారు. అంతే..అనుకుంటున్నాను!?
2 comments:
When young it's safe but pregnant and just delivered ladies need tob more cautious and attention.
Thank you. But my doubt..Is it necessary to stay in hospital? Is it not enough staying in s separate room at home itself ? And that's what people do in small towns or villages..I guess.
Post a Comment