దూరం గా వుంటే దూరం గా వున్నావనే బాధ
దగ్గరకొస్తే మళ్ళీ దూరమయిపోతావనే భయం
మాట్లాడకపోతే మాట్లాడలేదనే దిగులు
మాట్లాడితే మాటలు అయిపోతాయేమోననే బెంగ
మాటలెందుకు ...మనసే మోహనరాగం అంటావా..?
కనురెప్ప మూద్దామంటే నీ రూపం కనుమరుగవుతుందేమో
తెరుద్దామంటే రెప్పల మాటు నుంచీ జారిపోతావేమో
కంటిపాపవే నువ్వు అయినప్పుడు..రెప్పలతో పనేముంది అంటావా..?
కలలో అయినా చూద్దామంటే
కల కరిగిపోయి ...కలగానే మిగిలిపోతావేమో ..
కలలూ...కల్లలూ ఎందుకు..మనసుతోనే చూడు ..అంటావా ?
కల్లోల సముద్రం లో గడ్డిపరక లాంటి ఆశని పట్టుకుని
లేని తీరం కోసం ..గమ్యం లేని ప్రయాణం.
2 comments:
challa bagundi manasu loni badhanu vyaktham chesinatu undi
కల కరిగిపోయి ...కలగానే మిగిలిపోతావేమో ..గ్రేట్
అవును మనసే మంజుల నాదం
Post a Comment