2020 నుండీ 2023 వరకూ మా బాల్కనీ నుంచీ కనబడిన దృశ్యం...గత ఏడాది నుంచీ క్రమంగా మారుతూవస్తున్న చిత్రాలు.
'అయ్యో..క్రిందటేడాది వరకూ ఆ కొండ, సముద్రం ఎంత బాగా కనబడేవో కదా!' అని అసంతృప్తి.
మరి మా బిల్డింగ్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇలానే అనుకుని ఉండి ఉంటారు..'ఆ apartment రాకముందు ఆ కొండ, సముద్రం ఎంత బాగా కనబడేవో!'
ఎంతో కొంత చెట్టూ చేమా నష్టపోకుండా ఏ ఇల్లూ, ఏ భవంతీ లేవదు. అలాగే రోడ్లూ..
మనం అనుభవిస్తున్న ఇళ్ళూ, హైవేలూ, luxurious resorts, అందమైన hill stations, యాత్రా స్థలాలలో సౌకర్యాలూ అన్నీ ప్రకృతినీ, పర్యావరణాన్నీ నష్ట పరచి వచ్చినవే. లీటర్లు లీటర్లు పెట్రోల్ పోసుకుని, హైవే ల మీద షికార్లు చేస్తాం, ఇంకా విమానాల్లో విహరిస్తాం, అందమైన హిల్ స్టేషన్స్ లో vacations ని enjoy చెయ్యటానికి స్టార్ హోటల్స్ నుంచీ బడ్జెట్ హోటల్స్ లో ఉంటాం, యాత్రలకు వెళ్తాం..
ప్రకృతీ, పర్యావరణ నష్టాన్ని ప్రశ్నించే అర్హత హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులకీ, మారుమూల అడవుల్లో నివసించే అడవి బిడ్డలకీ మాత్రమే ఉంది.