Friday, October 27, 2023

బతుకమ్మ 2023

మూడేళ్ళ క్రితం హైదరాబాద్ నుంచీ బతుకమ్మను నాతో పాటూ వైజాగ్ తెచ్చుకున్నాను.  మూడేళ్ళ నుంచీ ఒక్క మా ఇంటికే వచ్చి అందరి చేతా ఆడిపాడించుకున్న అమ్మ ఈసారి మా ఇంటికే కాకుండా  మా  అపార్ట్మెంట్స్ కి కూడా విచ్చేసింది.   అందరూ శ్రద్ధగా  ఒకే అమ్మని పేర్చుతూ అమ్మకి ఘనంగా స్వాగతం చెప్పారు.    ఉత్సాహంగా అందరి చేతా ఆటపాటలు అందుకుంది బతుకమ్మ.  మొదటిసారి అయినా కూడా దివ్యంగా పండుగ జరిపించుకుంది అమ్మ 🙏🏻♥️.