Tuesday, November 1, 2022

ద్వంద్వం

పలుకులాడే పెదవుల వెనుక కరడుకట్టిన నిశ్శబ్దం

పరుచుకున్న నవ్వులో మరుగునపడిన జీవం

అటుఇటు తిరిగే నడకల వెనుక జడమైన  చైతన్యం

మూసిన రెప్పల వెనుక తెరిచే ఉన్న చూపు

మస్తిష్కం నిండా ఆలోచనలు..మనసులో అభావమైన శూన్యం

బాధ్యతలు నెరవేర్చాలనే ఆరాటం తామరాకుమీద నీటిబొట్టులా కూర్చుంది

గడ్డకట్టిన హిమానీ నదము.. ఒకప్పటి రాగతరంగిణి