ఎప్పటికీ..
వింటూనే ఉంటాను .. తరంగాలుగా నాలో ప్రతిధ్వనించే నీ మాటలని
చూస్తూనే ఉంటాను...నా హృదయంలో నిండుగా నీ రూపాన్ని
శ్వాసిస్తూనే ఉంటాను...నా చుట్టూ పరచుకున్న నీ ఊపిరి పరిమళాన్ని
ఆస్వాదిస్తూనే ఉంటాను....కమ్మనయిన నీ మనసు చెమ్మని
స్పర్శిస్తూనే ఉంటాను ..నాలోనే ఉన్న నీ ఆత్మని..