ఇప్పుడే..
వెన్నెల చల్లగా..తెల్లగా ఉంటుందని తెలుసు..
వెన్నెల్లో తడవచ్చని ..ఇప్పుడే తెలిసింది..
మేఘాలతో వర్షం వస్తుందని తెలుసు..
మేఘాన్ని చూడగానే పురివిప్పే నెమలి ఇప్పుడే తెలిసింది..
పూల పరిమళం తెలుసు..
పువ్వులోని మకరందపు తీపి ఇప్పుడే తెలిసింది..
మనసుందని తెలుసు..
దానికి స్పందన ఉంటుందని ఇప్పుడే తెలిసింది.