చిన్నపుడు ఉరుముల శబ్దం అంటే చాలా భయపడేదాన్ని..ఎక్కడ నా పక్కనే పిడుగు పడుతుందో అని. ఆ శబ్దానికి నేను దడుచుకున్నప్పుడల్లా మా అమ్మ నా వీపు మీద ఒక్కటిచ్చేది..అదే తట్టేది. అసలు పిడుగు పడటం అంటే భగ భగ మండుతున్న పెద్ద బండరాయి ఆకాశం నుండి పడుతుంది అనుకునేదాన్ని.
కానీ పెద్దదాన్ని అవుతున్నకొద్దీ ఉరుము రహస్యం తెలిసిపోయింది. ఇప్పుడు నేను చాలా expert అయిపోయాను..ఎంత మెరుపుకి ఎంత ఉరుము వస్తుందో ..ఆ మెరుపుని బట్టి ముందరే గట్టిగా చెవులు మూసుకోటంలో.
(ఇంతకీ నా భయం ఉరుము శబ్దానికా లేక పిడుగు పడుతుందనా..? ఇప్పటికీ అర్ధం కాదు.)
No comments:
Post a Comment