అసలు:
ఆ మధ్య జైపూర్ వెళ్ళినప్పుడు హవామహల్ లో మరమ్మత్తులు/beautification పనులు చేస్తున్న వారితో తీసిన ఫోటో ఇది. అందమైన ఆ కట్టడాన్ని చూస్తూ అలా తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ నా వైపే చూస్తూ నవ్వుతూ ఉండటం కనిపించింది. (నేను మరీ అంత ఫన్నీ గా ఉన్నానా!?) వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరించాను..కబుర్ల తర్వాత వాళ్ళ జ్ఞాపకంగా ఉంటుందని వాళ్ళ అనుమతి తో ఫోటో తీసుకుని .. .. నా ఫోటోకి 'మోడలింగ్' చేసినందుకు చిన్నబహుమానం ఇచ్చాను.
కొసరు:
ప్చ్..ఏంటో చప్పగా ఉంది పైన రాసినది. అసలు ఈ ఫోటో చూస్తుంటే సామాజిక స్పృహతో కూడిన సృజనాత్మకత తన్నుకుని మరీ మరీ వస్తోంది..ఎన్ని రకాలుగా రాయొచ్చో కదా!!
మచ్చుకి ఏదో కొంచెం...
మచ్చుకి ఏదో కొంచెం...
శ్రామికుల శ్రమని దోచుకున్నది చాలక వాళ్ళకి ఫోటోలు తీసి దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళ పేదరికాన్ని కూడా వదలకుండా వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం. ఇలా అమాయక కష్ట జీవులతో సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్ లోనూ, వాట్సాప్ ల్లో, ఇన్స్టాగ్రామ్ ల్లో పోస్ట్ చేసి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టూ, తామేదో ఘనకార్యం చేసినట్టూ తెగ ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి ఫోటోల వల్ల వీళ్ళ అహంకార ధోరణి బయటపడుతూ ఉంటుంది.
హమ్మయ్య..ఇప్పుడు బాగుంది.
1 comment:
"సామాజిక స్పృహ" పెల్లుబుకుతున్న మీ కొసమెరుపు బాగుందండి 🙂. మీరన్నది నిజం కూడాను. ఇటువంటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం fashion statement లాగా తయారవుతోంది రానురాను.
Post a Comment