పొగమంచులా నెమ్మదిగా కమ్ముకున్న దూరం..
ఎప్పటికీ కరగని, దేనితోనూ పగలని మంచుగోడగా మిగిలింది..
నివురుకప్పిన నిప్పులా మనసులో ఉప్పొంగుతున్న లావా..
ఎంత తడిపినా చిగురించని తోట..రాలిపోతున్న ఎండుటాకుల్లాంటి ఆశలు..
అందమయిన చిత్రం వేద్దామనుకున్న కాగితం మీద ఒలికి పోయిన రంగులు..
అంతా రంగులమయమే..కానీ భావం లేని బొమ్మ మిగిలింది..జీవితం ఒలికిపోయింది..
చీకటిలో దీపం కోసం తడుములాట..అసలు దీపం వుంటే వెతుకులాటేందుకు..
దాహం కోసం వెళ్తే ఎండమావి మిగిల్చిన కన్నీళ్లు..
అందమయిన కొలను అనుకుంటే..బురద నిండిన ఊబి..
లోపలకు కూరుకుపోతూ కూడా నీటి కోసం అన్వేషణ..
పొదరిల్లుగా భ్రమపడిన సాలెగూడు..బయటకు రాలేక కృశించి..అందులోనే నశించి..
అలసిపోయి ఆగిన ప్రయాణం..ఏదో చల్లటి స్పర్శ..అనిర్వచనీయం ఆ సాంత్వన ..
ఏదో అర్ధమయిన భావన..దైవ నామ స్మరణ..
నీడలా వెన్నంటి వచ్చేది..అదే ప్రేరణ..అదే సాంత్వన..అదే పరమార్ధం..అదే నిత్య సత్యం..
8 comments:
నిత్య సత్యం సుఖదుఃఖాల మరకలంటని తెల్ల కాగితంలా.........
ఒక విషయాన్ని చక్కగా చెప్పారు.
జీవితం ఒలికిపోయింది ... దైవ నామ స్మరణ...
ఈ రెండుచోట్లా గుండె లయ తపుతుందేమో అనిపించి , మళ్లీ మామూలయింది
బొందలపాటి వారి రికమెండేషనుతో వచ్చాను!
అద్భుతమైన కవిత చదివి వెళ్తున్నాను!
మళ్ళె వస్తాను!
బొందలపాటి వారి రికమెండేషనుతో వచ్చాను!
అద్భుతమైన కవిత చదివి వెళ్తున్నాను!
మళ్ళీ వస్తాను!
జీవితం యొక్క meta physical emptiness and pain గురించి బాగా రాసారు. నొప్పి తో మొదలై (pain) అదే నొప్పితో అంతమైఏదే జీవితం.
Dhanyavaadhamulu Lakshmi Ramarao Rajamanuri Vedurumudi gaaru oka Jeerninchukoleni Nijam cheppparu
Fantastic!
నా పోస్ట్ చదివి స్పందించినందుకు ధన్యవాదములు..హరిబాబు గారు, సుధాకర్ గారు, వెంకటరామిరెడ్డి గారు,రామకృష్ణ గారు.
Post a Comment